టాలీవుడ్‌లో పుష్ప, రంగస్థలం, ఉప్పెన, తలైవి, అంతరిక్షం 9000 kmph.. సహా పలు చిత్రాలకు తమ ఆర్ట్ వర్క్‌తో ఓ డిఫరెంట్ లుక్ తీసుకొచ్చిన ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్, ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ, మోనిక. ఇప్పుడు డైనమిక్ స్టార్ నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ అవెయిటింగ్ పీరియాడ్ ఫిల్మ్ డెవిల్- ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ చిత్రానికి పని చేస్తున్నారు. కొత్త టాలెంట్‌ను, డిఫరెంట్ మూవీస్‌ను ఎంకరేజ్ చేయడంలో ముందుండే కళ్యాణ్ రామ్ మరో యంగ్ డైరెక్టర్ నవీన్ మేడారం యూనిక్ స్టోరితో తెరకెక్కిస్తోన్న డెవిల్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బ్రిటీష్ కాలానికి చెందిన కథాంశంతో రూపొందనున్న ఈ చిత్రాన్ని దేవాంశ్ నామా సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు.
ఈ పీరియాడిక్ మూవీ కోసం 1945లో బ్రిటీష్ వాళ్లు పరిపాలించిన మద్రాస్ ప్రెసిడెన్సీ సెట్‌ను ఈ సినిమా కోసం రామకృష్ణ, మోనిక రూపొందించనున్నారు. ఎవరికీ తెలియని ఓ రహస్యాన్ని ఛేదించడానికి నియమించబడ్డ రహస్య గూఢచారే డెవిల్. ఈ రహస్యం అతను ఊహించిన దాని కంటే మరింత లోతుగా ఉంటుంది. ఈ ప్రయాణంలో అతను ప్రేమ, మోసం, ద్రోహం అనే వలయాల్లో ఎలా చిక్కుకున్నాడు. ఈ మిస్టరీ కథానాయకుడి జయాపజయాలపై తీవ్ర పరిణామాలను చూపేలా ఉంటుంది. చరిత్ర గతిని మార్చేంత సామర్థాన్ని కలిగి ఉంటుంది.
ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ భారీ చిత్రంలో వర్క్ చేస్తున్నారు. పుష్ప చిత్రానికి కథను అందించిన రైటర్ శ్రీకాంత్ విస్సా డెవిల్ చిత్రానికి కథను అందిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. రీసెంట్‌గా నందమూరి కళ్యాణ్‌రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సీక్రెట్ బ్రిటీష్ ఏజెంట్ పాత్రలో కళ్యాణ్‌రామ్ ఇది వరకెప్పుడూ చేయని సరికొత్త లుక్‌లో కనిపిస్తుండటం విశేషం.
స్వాతంత్య్రం రాక ముందు కథాంశంతో రూపొందే సినిమా కావడంతో అప్పటి సంస్కృతి సంప్రదాయాలను తెలియజేసేలా భారీ సెట్స్ అవసరమవుతాయి. అలాంటి సెట్స్‌ను వేసి ప్రేక్షకులను మెప్పించడం అనేది చాలా కష్టతరమైన విషయం. ప్రస్తుతం రామ్‌చరణ్, శంకర్ కాంబినేషన్ మూవీతో పాటు అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో రూపొందుతోన్న పుష్ప సినిమాకు వర్క్ చేస్తున్న రామకృష్ణ, మోనికలు ఈ ఛాలెంజింగ్ మూవీలో పార్ట్ కావడానికి సిద్ధమయ్యారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా డెవిల్ రూపొందుతోంది. ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్‌ను రాబోయే రోజుల్లో అందించడానికి నిర్మాతలు సిద్ధమవుతున్నారు.
సాంకేతిక వర్గం:
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: నవీన్ మేడారం, నిర్మాత: అభిషేక్ నామా, సమర్పణ: దేవాంశ్ నామా, కథ: శ్రీకాంత్ విస్సా, సంగీతం: హర్ష్ వర్ధన్ రామేశ్వర్, ప్రొడక్షన్ డిజైనర్ & ఆర్ట్ డైరెక్టర్: రామకృష్ణ, మోనిక