Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముగ్గురు కాలేజీ స్నేహితుల కథతో మ్యాడ్ స్క్వేర్ రాబోతోంది

Advertiesment
Sangeet Shobhan, Narne Nithin, Ram Nithin

డీవీ

, శనివారం, 18 జనవరి 2025 (17:22 IST)
Sangeet Shobhan, Narne Nithin, Ram Nithin
మ్యాడ్ కి సీక్వెల్ గా 'మ్యాడ్ స్క్వేర్ టీజర్ విడుదల కాకముందే, ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇప్పటికే విడుదలైన లడ్డు గానీ పెళ్లి, స్వాతి రెడ్డి పాటలు చార్ట్‌బస్టర్‌లుగా మారడంతో పాటు అన్ని చోట్ల ప్లేలిస్ట్‌లలో అగ్రస్థానంలో నిలిచాయి. సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్‌ ప్రధాన తారాగణం.
 
మ్యాడ్ స్క్వేర్ చిత్రాన్ని 2025 మార్చి 29న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేయనున్నట్లు తాజాగా నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఒక సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ ఎంతో ఆకర్షణీయంగా ఉంది. అలాగే "మీరు హ్యాండిల్ చేయగలిగిన దానికంటే ఎక్కువ వినోదం, మీరు ఊహించిన దానికంటే ఎక్కువ మ్యాడ్ నెస్." అని నిర్మాతలు పేర్కొన్నారు. మొత్తానికి మ్యాడ్ స్క్వేర్ చిత్రంతో థియేటర్లలో వినోద అనుభవాన్ని మరో స్థాయికి తీసుకువెళ్ళబోతున్నారు నిర్మాతలు.
 
మ్యాడ్ సినిమాలో తనదైన ప్రత్యేక శైలి హాస్య సన్నివేశాలు, ఆకర్షణీయమైన కథనంతో ఎంతో పేరు తెచ్చుకున్న దర్శకుడు కళ్యాణ్ శంకర్, ఈ సీక్వెల్ తో మరోసారి నవ్వుల విందుని అందించబోతున్నారు. సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ ఛాయగ్రాహకుడు శామ్‌దత్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.
 
మ్యాడ్ స్క్వేర్ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.
 
2023 లో విడుదలైన మ్యాడ్ మొదటి భాగం సంచలన విజయం సాధించడంతో, కేవలం ప్రకటనతోనే మ్యాడ్ స్క్వేర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సరికొత్త హాస్య చిత్రం ముగ్గురు కాలేజీ స్నేహితుల జీవితాలు, వారి పరిస్థితుల చుట్టూ తిరుగుతుంది. ఈ సీక్వెల్ మొదటి భాగాన్ని మించి రెట్టింపు వినోదాన్ని అందించేందుకు సిద్ధం అవుతోంది

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాస్తికులు-ఆస్తికులు అనే కాన్సెప్ట్‌ తో కన్నప్ప రూపొందింది : చిత్ర యూనిట్