Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 6 April 2025
webdunia

కొలువుదీరిన కొత్త మా కార్యవర్గం - ప్రకాష్ రాజ్ - చిరంజీవి డుమ్మా

Advertiesment
MAA Election
, శనివారం, 16 అక్టోబరు 2021 (13:24 IST)
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) కొత్త కార్యవర్గం శనివారం కొలువుదీరింది. అధ్యక్షుడు మంచు విష్ణు ఇప్పటికే అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు. శనివారం ఆయనతో పాటు ఆయన తరపున గెలిచిన సభ్యులు మా సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు.
 
ఈ కార్యక్రమానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. పలువురు సినీ ప్రముఖులూ వచ్చారు. అంతకుముందు ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా కల్చరల్ సెంటర్‌లో కొత్త కార్యవర్గం సభ్యుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించారు. పూజలో మంచు విష్ణు, నరేశ్, శివబాలాజీ, ఆయన భార్య మధుమిత, మాదాల రవి తదితరులు పాల్గొన్నారు.
 
ఈ కార్యక్రమానికి ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులు దూరంగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి సైతం కూడా హాజరు కాలేదు. ఇటీవలి ఎన్నికల్లో విష్ణు ప్యానెల్‌కు చెందిన 15 మంది, ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌లోని 11 మంది విజయం సాధించారు. 
 
అయితే, తదనంతర పరిణామాల నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులంతా రాజీనామా చేశారు. వీరి స్తానంలో ఎవరిని నియమిస్తారన్న అంశంపై సందిగ్ధత నెలకొంది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాశి ఖన్నా గ్లామరస్ లుక్, షేర్ చేసిన టాలీవుడ్ బ్యూటీ