Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నందమూరి కళ్యాణ్ స్పై థ్రిల్లర్ డెవిల్ నుంచి లిరికల్ సాంగ్

Advertiesment
Devil
, మంగళవారం, 19 డిశెంబరు 2023 (14:00 IST)
Devil
డిఫరెంట్ మూవీస్‌తో త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ ‘డెవిల్. అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా ద‌ర్శ‌క నిర్మాత‌గా ఈ సినిమాను రూపొందించారు. డిసెంబ‌ర్ 29న ప్ర‌పంచ వ్యాప్తంగా సినిమా భారీ ఎత్తున విడుద‌ల‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. ఇదొక పీరియడ్‌ డ్రామా. బ్రిటీష్‌వారు ఇండియాను ప‌రిపాలించిన కాలానికి సంబంధించిన క‌థ‌తో తెర‌కెక్కిన సినిమా కావ‌టంతో నాటి ప‌రిస్థితుల‌ను ఆవిష్క‌రించేలా భారీగా సినిమాను చిత్రీక‌రించారు.
 
‘ డెవిల్’ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, పాటలు, టీజర్‌ సూపర్బ్ రెస్పాన్స్‌ని రాబట్టకున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం మేకర్స్ ఈ మూవీ నుంచి ‘దూరమే తీరమై..’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. సమీర భరద్వాజ్ ఈ పాటను రాసి పాడటం విశేషం.
 
‘డెవిల్’ చిత్రంలో ఎవ‌రికీ అంతు చిక్క‌ని ఓ ర‌హ‌స్యాన్ని ఆయ‌న ఛేదించే బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ఆక‌ట్టుకోబోతున్నారు. గ‌త ఏడాది తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో వ‌న్ ఆఫ్ బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచిన ‘బింబిసార’తో మెప్పించిన కళ్యాణ్ రామ్ ఈ ఏడాది ‘డెవిల్’తో మెప్పించటానికి రెడీ అవుతున్నారు.
 
 అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై  అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, త‌మిళ్‌, క‌న్న‌డ భాష‌ల్లో రిలీజ్ చేస్తున్నారు. ఎన్నో మంచి చిత్రాను మనకు అందించిన అభిషేక్ పిక్చర్స్ సంస్థలో రూపొందుతోన్న ఈ సినిమాకు   శ్రీకాంత్ విస్సా  మాట‌లు, స్క్రీన్ ప్లే, క‌థ‌ను అందించారు. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ సంగీత సార‌థ్యం వ‌హిస్తుండ‌గా సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేశారు. గాంధీ నడికుడికర్ ఈ సినిమాకు ప్రొడఓన్ డిజైనర్‌గా బాధ్యతలను నిర్వహించారు. త‌మ్మిరాజు ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాస్ మహారాజా రవితేజ ఈగల్ ట్రైలర్ రాబోతుంది