Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్టైల్‌గా ఉండటమే ఇష్టం.. తోటి నటీమణులు తిట్టుకుంటారు: సోనమ్ కపూర్

Advertiesment
fashion trend
, బుధవారం, 23 డిశెంబరు 2015 (18:17 IST)
ఫ్యాషన్‌కి స్టైల్‌కి చాలా తేడా వుందని, ఫ్యాషనబుల్‌గా ఉండటం కంటే స్టైల్‌గా ఉండటమే తనకు ఇష్టమని బాలీవుడ్ స్టైలిష్ స్టార్ సోనమ్ కపూర్ వెల్లడించింది. తన ఫ్యాషన్ చూసి తోటి నటీమణులు తిట్టుకుంటారని ముంబైలో జరిగిన ఫిలిమ్‌ఫేర్ గ్లామర్ అండ్ స్టైల్ అవార్డుల ఫంక్షన్‌లో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ చెప్పింది.

ఫ్యాషన్ ట్రెండ్ విషయాల్లో నటీనటులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, లేకుంటే సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడం అనేది అంత సులభం కాదని చెప్పుకొచ్చింది. 
 
ఓ సారి ఓ సీనియర్ నటి తనను చూసి ఎందుకింత ఫ్యాషన్‌గా, స్టైల్‌గా ఉంటావ్ అని ప్రశ్నించారని తెలిపింది. అయితే స్టైల్‌ కోసం అందరూ అనుకుంటున్నట్లు చాలా ఖర్చు పెట్టనని.. తనకు ఇష్టమైనట్లు తయారవుతానని.. అవసరం అనుకుంటే తన సోదరి సాయం తీసుకుంటానని సోనమ్ తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu