Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Dil Raju: లివ్ ఇన్ రిలేషన్.. కానీ పిల్లలు పుట్టడమే సమస్య : దిల్ రాజు

Advertiesment
Dil Raju, Vikrant, Chandini Chowdhury, Madhura Sridhar Reddy, Anand Deverakonda

చిత్రాసేన్

, గురువారం, 6 నవంబరు 2025 (17:53 IST)
Dil Raju, Vikrant, Chandini Chowdhury, Madhura Sridhar Reddy, Anand Deverakonda
కల్యాణ్ ప్రాప్తిరస్తు అని వినేవాళ్లం, ఇప్పుడు సంతాన ప్రాప్తిరస్తు అని వింటున్నాం. లివ్ ఇన్ రిలేషన్, పెళ్లి సులువు అయ్యింది. కానీ పిల్లలు పుట్టడమే సమస్యగా మారుతోంది. అందుకే ఈ సినిమాకు ఈ టైటిల్ పెట్టుకున్నారు. హీరో హీరోయిన్స్ విక్రాంత్, చాందినీ, ప్రొడ్యూసర్స్ మధుర శ్రీధర్, హరి ప్రసాద్, డైరెక్టర్ సంజీవ్ రెడ్డికి ఆల్ ది బెస్ట్. ఇందాక ఈ టీమ్ తో చెబుతున్నా అని ప్రొడ్యూసర్ దిల్ రాజు అన్నారు.
 
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన సినిమా సంతాన ప్రాప్తిరస్తు. ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ప్రముఖ నిర్మాత దిల్ రాజు, యంగ్ టాలెంటెడ్ హీరో ఆనంద్ దేవరకొండ అతిథులుగా "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.
 
డైరెక్టర్ సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ - దేశంలోనే ఎక్కువ సంఖ్యలో ఫెర్టిలిటీ సెంటర్స్ ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. మా కథకు ఇలాంటి ఒక ఇష్యూను కలిపితే బాగుంటుంది అనిపించింది. టీమ్ అంతా కలిసి ఒక బ్యూటిఫుల్ ఔట్ పుట్ మూవీకి తీసుకొచ్చారు. మా చిత్రాన్ని చూసి ఆదరించాలని కోరుతున్నా. అన్నారు.
 
ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ - దిల్ రాజు గారు నా కెరీర్ ప్రారంభం నుంచీ సపోర్ట్ చేస్తున్నారు. నా స్నేహ గీతం, ఇట్స్ మై లవ్ స్టోరీ, బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ సినిమాలకు దిల్ రాజు గారు తన వ్యాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు. "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా ట్రైలర్ ను రాజు గారి చేతుల మీదుగానే రిలీజ్ చేయాలని అనుకున్నాం. ఆనంద్ మా హీరో. తను ఈ ఈవెంట్ కు రావడం హ్యాపీగా ఉంది. వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్..ఇలా మంచి కాస్టింగ్ మిమ్మల్ని ఎంటర్ టైన్ చేయబోతున్నారు. ఒక కాన్సెప్ట్ మూవీకి ఏం కావాలో అవన్నీ చేశాం. ట్రైలర్ తో మా సినిమా ఎలా ఉండబోతుందో మీకు తెలిసే ఉంటుంది. సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుందని నమ్ముతున్నాం. నా టీమ్ అందరికీ థ్యాంక్స్. అన్నారు.
 
హీరోయిన్ చాందినీ చౌదరి మాట్లాడుతూ - మేల్ ఫెర్టిలిటీ అనే ఇష్యూను తీసుకుని ఎంటర్ టైన్ మెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఎక్కడా హద్దు దాటకుండా సెన్సబుల్ గా ప్రేక్షకులంతా కలిసి చూసేలా మా చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు సంజీవ్ రెడ్డి. ట్రైలర్ ను అందరికీ షేర్ చేయండి. మీ ఫ్యామిలీ , ఫ్రెండ్స్ తో థియేటర్స్ కు రావాలని రిక్వెస్ట్ చేస్తున్నా. అన్నారు.
 
హీరో విక్రాంత్ మాట్లాడుతూ - ఆనంద్, నేను యూఎస్ లో ఉద్యోగాలు చేసి సినిమా మీద ప్యాషన్ తో ఇక్కడికి వచ్చాం. ఆనంద్ బేబి మూవీతో మంచి విజయాన్ని అందుకున్నారు. నేను గతంలో ఒక సినిమా చేశాను. ఆ మూవీ సరిగ్గా ఆదరణ పొందలేదు. నిరాశలో ఉన్న ఆ టైమ్ లో మధుర శ్రీధర్ గారు నీతో సినిమా చేస్తాను అని సపోర్ట్ గా నిలబడ్డారు. ఆ తర్వాత హరి ప్రసాద్ గారు జాయిన్ అయ్యారు. ఈ చిత్రంలో చైతన్య అనే సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ క్యారెక్టర్ లో నటించాను. ఆ పాత్రకు తగినట్లు నన్ను దర్శకుడు సంజీవ్ గారు మార్చేశారు. మంచి మెసేజ్ కూడా ఉంది. ఇవన్నీ ఇప్పుడున్న ప్రేక్షకులను థియేటర్స్ కు రప్పించే ఎలిమెంట్స్. కాబట్టి "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా తప్పకుండా మీ ఆదరణ పొందుతుందని నమ్ముతున్నాను. అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో ప్రీమియర్లకి అద్భుతమైన స్పందన : తిరువీర్