Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నువ్వే అర్థం చేసుకోకపోతే ఎవరూ అర్థం చేసుకోలేరు..?

Advertiesment
Live Bigg Boss Telugu 4
, మంగళవారం, 1 డిశెంబరు 2020 (12:37 IST)
బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో భాగంగా నామినేషన్ ప్రక్రియ జరుగుతోంది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఈ వారం కూడా అవినాష్‌.. మోనాల్‌, అఖిల్‌లని నామినేట్ చేశాడు. మోనాల్ వీక్ అని చెప్పగా, నువ్వు చెప్పకు జనాలు డిసైడ్ చేశారు కదా అని కౌంటర్ ఇచ్చింది. ఇక అఖిల్ తనని వరస్ట్ కెప్టెన్ అన్నందుకు నామినేట్ చేసినట్టు తెలిపాడు అవినాష్‌. అభిజిత్.. మోనాల్‌, హారికలను నామినేట్ చేశాడు. 
 
మోనాల్ గురించి మాట్లాడుతూ.. నీ వలన ఎమోషనల్‌గా హర్ట్ అవుతున్నా. ఈయన తప్పేం లేదు కాని, నాకే ఎదో ప్రాబ్లమ్ వస్తుంది. నువ్వు స్టాండ్ తీసుకుంటే బాగుంటుంది అనిపించిందని అభి అన్నాడు. ఇప్పటి నుండి మన మధ్య విభేదాలు రాకుండా చూసుకుందాం అని అఖిల్‌తో చెప్పి హారికని నామినేట్ చేశాడు. 'టాస్కు చేయకపోవడం నాకు తప్పు. కానీ ఎందుకు చేయలేదనే విషయం నీకు బాగా తెలుసు. నువ్వే అర్థం చేసుకోకపోతే ఎవరూ అర్థం చేసుకోలేరు' అంటూ హారిక కంటైనర్‌లో కొన్ని రంగు నీళ్ళు పోసాడు అభి.
 
ఇక అరియానా తనని వరస్ట్ కెప్టెన్ అన్నందుకు హారిక, అవినాష్‌, సోహైల్‌ను నామినేట్ చేసింది. ఈ క్రమంలో అరియానా- మోనాల్ మధ్య మాటల యుద్దం జరిగింది. ఆ సమయంలో మధ్యలో దూరిన అవినాష్ తెలుగులో మాట్లాడకు అని చెప్పడంతో అతనికి లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకింది. మధ్యలో నువ్వు మాట్లాడకు అవినాష్ అంటూ మోనాల్ అరిచేసింది. ఇక సోహైల్‌.. అవినాష్, అరియానాలని నామినేట్ చేసాడు. అవినాష్ నువ్వు ఎవిక్షన్ పాస్ విషయంలో చాలా బాధపడ్డావు కరెక్ట్ కాదు. అలానే ఊరికే మోనాల్‌ని వీక్ అనొద్దు అంటూ అభ్యర్థించాడు.
 
నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యే సమయానికి అభిజిత్‌, అవినాష్‌, మోనాల్‌, అఖిల్‌, హారికలలో బౌల్స్‌లో ఎక్కువ రంగు నీళ్లు ఉండడంతో వీరిని నామినేట్ చేశారు బిగ్ బాస్. అయితే అఖిల్- మోనాల్ మధ్య జరిగిన వాగ్వివాదం వలన హర్ట్ అయిన మోనాల్ కిచెన్‌లోకి వెళ్లి ఏడ్చింది. ఈమెని హారిక ఓదార్చసాగింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యంగ్‌ హీరో నాగశౌర్య కొత్త చిత్రం 'ల‌క్ష్య', వామ్మో... టాలీవుడ్ కండలవీరుడులా మారాడే?