'వీరబలి'గా ప్రభాస్... తమిళంలోకి రెబల్ అనువాదం
'బాహుబలి' సినిమాతో ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అలా తమిళంలోనూ ఆయన అభిమానుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దాంతో అంతకుముందు తెలుగులో ఆయన నటించిన సినిమాలు అనువాదాలుగా అక్కడ సందడి చేస్తున్న
'బాహుబలి' సినిమాతో ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అలా తమిళంలోనూ ఆయన అభిమానుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దాంతో అంతకుముందు తెలుగులో ఆయన నటించిన సినిమాలు అనువాదాలుగా అక్కడ సందడి చేస్తున్నాయి. అలా తాజాగా అక్కడ 'వీరబలి' విడుదలైంది. 2012లో ప్రభాస్ హీరోగా లారెన్స్ దర్శకత్వంలో 'రెబల్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, లారెన్స్ టేకింగ్కి.. ప్రభాస్ స్టైల్‌కి మంచి మార్కులు పడిపోయాయి. తమిళనాట ప్రభాస్‌కి గల క్రేజ్ దృష్ట్యా, ఈ సినిమాని 'వీరబలి' పేరుతో విడుదల చేశారు. తమన్నా కథానాయికగా నటించిన ఈ సినిమా, అక్కడ ఎలాంటి ఫలితాన్ని రాబట్టుకుంటుందో చూడాలి.