Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లాంప్- ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆవిష్క‌రించిన‌ యండమూరి

Advertiesment
లాంప్- ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆవిష్క‌రించిన‌ యండమూరి
, శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (17:41 IST)
Lamp First Look, Yandamuri and unit
నువ్వుల వినోద్, కోటి కిరణ్, మధుప్రియ, అవంతిక హీరో హీరోయిన్లుగా `లాంప్` చిత్రం రూపొందుతోంది. చరిత సినిమా ఆర్ట్స్ బ్యానర్ పై `ఏడుచేపలకథ` నిర్మాత జి వి యన్ శేఖర్ రెడ్డి నిర్మించారు. రాజశేఖర్ దర్శకుడు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను నవలా రచయత డాక్టర్ యండమూరి వీరేంద్రనాథ్ విడుదల చేశారు.
 
అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ ద‌ర్శ‌కుడు క‌థ చెప్పినప్పుడు చాలా ఆస‌క్తిగా అనిపించింది. అంతర్లీనంగా మంచి మెసేజ్ కూడా ఉంది. ఏడుచేపలకథ చిత్ర నిర్మాత ఈ సినిమాను ఎక్కడ  కంప్రమైస్ కాకుండా నిర్మించి ఉంటారు. ప్రేక్షకులు కూడా  ఈ సినిమా ని బాగా ఆదరించాలని ఈ చిత్రంలో నటించిన నటీనటులకు సాంకేతిక నిపుణలకు మంచిపేరు రావాలని అన్నారు.
 
నిర్మాత జి వి యన్ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ఏడుచేపలకథ తర్వాత ఎలాంటి మూవీ చేద్దామని ఆలోచిస్తున్న టైములో రాజశేఖర్ కథ చెప్పాడు నాకు బాగా నచ్చి చేశాను సినిమా బాగా వచ్చింది అన్ని వర్గాల ప్రేక్షలకు నచ్చుతుందని ఆశిస్తున్నా అన్నారు. దర్శకుడు రాజశేఖర్ మాట్లాడుతూ, సస్పెన్స్ థ్రిల్లర్ తో పాటూ ఒక చిన్న మెసేజ్ అందర్నీ అలరిస్తుందని తెలిపారు. ఇంకా రాకేష్ మాస్టర్, సి హెచ్ నాగేంద్ర, వై వి రావ్ , చలపతి నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా : క్రిష్ బొంగొని , ఎడిటింగ్ : గణేష్ దాసరి, మ్యూజిక్ : శ్రీ వెంకట్, నిర్మాత:  జి వి యన్ శేఖర్ రెడ్డి, కథ స్క్రీన్ ప్లే  దర్శకత్వం : రాజశేఖర్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ర‌వితేజ ఖిలాడి టాకీ పార్ట్ పూర్తి