Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనా వైరస్ నుంచి బయటపడిన మహేష్ 'హీరోయిన్'

Advertiesment
కరోనా వైరస్ నుంచి బయటపడిన మహేష్ 'హీరోయిన్'
, ఆదివారం, 20 డిశెంబరు 2020 (16:49 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన చిత్రం "1 నేనొక్కడినే". ఈ చిత్రంలో మహేష్‌బాబుకు జోడీగా కృతిసనన్ నటించింది. ఆ తర్వాత యువ హీరో నాగ చైతన్య అక్కినేనితో కలిసి "దోచెయ్" అనే చిత్రంలో నటించింది. 
 
ఈ రెండు సినిమాలు ప్లాఫ్ కావ‌డంతో బాలీవుడ్ చెక్కేసింది. అక్క‌డ స్టార్ హీరోల‌తో వ‌రుస సినిమాలు చేస్తూ అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందుతుంది. అయితే ఈ మ‌ధ్య రాజ్‌కుమార్ రావుతో క‌లిసి చండీఘ‌ర్‌లో సినిమా షూటింగ్‌లో పాల్గొంది. ఆ స‌మ‌యంలో త‌న‌కు క‌రోనా సోకింది.
 
క‌రోనా పాజిటివ్ అని నిర్దార‌ణ అయిన త‌ర్వాత కొద్ది రోజుల పాటు క్వారంటైన్‌లో ఉన్న కృతిస‌న‌న్‌కు తాజాగా నెగెటివ్ అని తేలింది. ఈ సంతోషక‌ర‌మైన విష‌యాన్ని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా తెలియ‌జేసింది. 
 
నాకు క‌రోనా నెగెటివ్ వ‌చ్చిన విష‌యాన్ని షేర్ చేసుకోవ‌డం సంతోషంగా ఉంది. ఈ క‌ష్టస‌మ‌యంలో నాకు స‌హాయ ప‌డ్డ వైద్యుల‌కు ధ‌న్య‌వాదాలు. నేను త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్ధించిన ప్ర‌తి ఒక్క‌రికి కృత‌జ్ఞ‌త‌లు అంటూ కృతి పేర్కొంది. వ‌చ్చే యేడాది ఈ అమ్మ‌డు అక్ష‌య్‌తో క‌లిసి బ‌చ్చ‌న్ పాండే అనే మూవీ చేయ‌నుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ మరో ప్రాజెక్టు ఓకే.. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్