Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సస్పెన్స్ థ్రిల్ల‌ర్ తో కృష్ణసాయి మూవీ జ్యువెల్ థీఫ్ రాబోతుంది

Advertiesment
Krishnasai, Meenakshi Jaiswal, Prema

డీవీ

, గురువారం, 25 జులై 2024 (15:25 IST)
Krishnasai, Meenakshi Jaiswal, Prema
తెలుగు తెర‌పైకి మ‌రో సస్పెన్స్ థ్రిల్ల‌ర్ రాబోతోంది. కృష్ణసాయి - మీనాక్షి జైస్వాల్ జంటగా నటిస్తున్న 'జ్యువెల్ థీఫ్' సినిమా టీజర్, ఆడియో లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా బ్యానర్‌పై, పీఎస్ నారాయణ దర్శకత్వంలో, ప్రొడ్యూసర్ మల్లెల ప్రభాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కృష్ణ సాయితో పాటు సీనియ‌ర్ న‌టీన‌టులు.. ప్రేమ, అజయ్, 30 ఇయర్స్ పృథ్వి, శివారెడ్డి, శ్రావణి, శ్వేతరెడ్డి తదితరులు న‌టించారు.
 
webdunia
Jewel Thief trailer function
హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో జ‌రిగిన 'జ్యువెల్ థీఫ్' సినిమా టీజర్, ఆడియో లాంచ్ వేడుక‌లో చీఫ్ గెస్టుగా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ డీఐజీ అనిల్ మింజ్, మరో చీఫ్ గెస్టు ఏపీ, తెలంగాణ ఇన్కమ్  టాక్స్ కమీషనర్ IRS ఆఫీసర్ జీవన్ లాల్ లవిదియ, మరో గెస్టు న‌టీ ఎస్త‌ర్ పాల్గొని చిత్ర టీజ‌ర్‌తో పాటు పాట‌ల‌ను విడుద‌ల చేశారు.
 
ఈ సంద‌ర్భంగా న‌టి ఎస్తార్ మాట్లాడుతూ... హీరో కృష్ణసాయి నిజ జీవితంలోనూ రియల్ హీరో. ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాంటి వారు అరుదుగా ఉంటారు. నిజంగా గ్రేట్. టీజ‌ర్ చూస్తే.. 'జ్యువెల్ థీఫ్' మంచి కాన్సెప్టుతో తెర‌కెక్కిన‌ట్టు అర్థ‌మ‌వుతున్న‌ది. సినిమా పెద్ద‌ హిట్ అవుతుందని నమ్మకం క‌లుగుతుంది.
 
హీరో కృష్ణ సాయి మాట్లాడుతూ... నేను సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానిని. ఆయన స్ఫూర్తితో సినిమాల్లోకి వ‌చ్చాను. 'జ్యువెల్ థీఫ్'  ఓ సస్పెన్స్ థ్రిల్ల‌ర్. ఈ త‌రం ప్రేక్ష‌కుల‌కు బాగా న‌చ్చుతుంది. ఇక ఎంఎం శ్రీలేఖ అందించిన మ్యూజిక్ బాగుంది. ఒక‌ప్పుడు హీరోయిన్ ప్రేమ గారి సినిమాలు చూశాను. ఆమెతో క‌లిసి న‌టించాల‌న్న నా కల ఈ సినిమాతో నెరవేరింది.
 
30 ఇయర్స్ పృథ్వి మాట్లాడుతూ... స‌మాజం కోసం కృష్ణ సాయి ఇంటర్నేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా కృష్ణ సాయి ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. మంచితనం, మానవత్వం కలబోసిన వ్యక్తి. గ‌తంలోనే కృష్ణ‌సాయి డ్రగ్స్ మీద అవగాహన వీడియోలు చేశారు. హీరోగా 'జ్యువెల్ థీఫ్' సినిమాలో యాక్షన్ పార్టులతో పాటు అద్భుతంగా నటించాడు.  నా రోల్ కూడా బాగుంది. సినిమా సూప‌ర్ హిట్ అవుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది.
 
డైరెక్టర్ పీఎస్ నారాయణ మాట్లాడుతూ... నా మీద నమ్మకంతో త‌న‌తో సినిమా చేయ‌మ‌ని కృష్ణసాయి వచ్చారు. ఆయనకు తగ్గ కథను పది రోజుల్లోనే పూర్తి చేశాను. సినిమా నటీనటులు, చిత్ర యూనిట్ అందరు బాగా చేశారు. ఇది చిన్న సినిమా కాదు, పేరున్న సీనియర్ నటీనటులు ఇందులో ఉన్నారు. అంద‌రిని ఆక‌ట్టుకునే సినిమా ఇది.
 
న‌టుడు మిమిక్రి శివారెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమాలో నాకు పూర్తి స్థాయి క్యారెక్టర్ ఇచ్చారు. దర్శకుడు మా అందరితో ఎంతో ఫ్రెండ్లీగా ఉండి సినిమా అద్భుతంగా పూర్తి చేశారు. శ్రీలేఖ అందించిన పాటలు బాగున్నాయి. కృష్ణసాయి గారికి అద్భుతమైన టాలెంట్ ఉంది.
 
ఈ హీరోయిన్ మీనాక్షి జైస్వాల్ మాట్లాడుతూ... ఈ సినిమాలో నాది ఛాలెంజింగ్‌ రోల్. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు కృత‌జ్ఞ‌త‌లు.
 
న‌టి ప్రేమ మాట్లాడుతూ... నాకు ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఈ సస్పెన్స్ థ్రిల్ల‌ర్ అంద‌రిని ఆకట్టుకుంటుంద‌న్న న‌మ్మ‌కం ఉంది.
 
టీజ‌ర్, ఆడియో వేడుక‌లో న‌టీన‌టుల‌తో పాటు, సినిమా యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా, సినిమా హైలైట్స్, చిత్రీకరణ అనుభవాలు తెలిపారు. త్వ‌ర‌లోనే సినిమాను థియేట‌ర్‌ల‌లో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గెటప్ శ్రీను బెస్ట్ పెర్ఫామెన్స్ తో రాజు యాదవ్: Aha OTT లో స్ట్రీమింగ్