Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇండస్ట్రీలో వారిద్దరు నా ఫ్రెండ్స్ అయితే.. జూనియర్ ఎన్టీఆర్ నా తమ్ముడు : రాజమౌళి

Rajamouli-NTR

ఠాగూర్

, గురువారం, 2 మే 2024 (12:02 IST)
ఇండస్ట్రీలో నిర్మాతల సాయి కొర్రపాటి, శోభు యార్లగడ్డ నాకు మంచి స్నేహితులు అయితే, జూనియర్ ఎన్టీఆర్ మాత్రం నాకు తమ్ముడితో సమానమని దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అన్నారు. కృష్ణమ్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం రాత్రి జరిగింది. ఇందులో రాజమౌళితో పాటు అనేక సినీ దర్శకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌పై రాజమౌళి ఆసక్తికర కామెంట్స్ చేశారు. 
 
పరిశ్రమలో మీకున్న బెస్ట్‌ ఫ్రెండ్స్‌ ఎవరని యాంకర్‌ ప్రశ్నించగా.. ఆడియన్స్‌ అందరూ ఎన్టీఆర్‌ అంటూ నినాదాలు చేశారు. దానికి రాజమౌళి సమాధానం చెబుతూ.. 'ఇండస్ట్రీలో నాకు ఇద్దరు బెస్ట్‌ ఫ్రెండ్స్‌ ఉన్నారు. 'బాహుబలి', 'ఈగ' నిర్మాతలు సాయి కొర్రపాటి, శోభు యార్లగడ్డ నాకు మంచి స్నేహితులు. ఎన్టీఆర్‌ నాకు తమ్ముడితో సమానం. మిత్రుడు కాదు. నా మొదటి సినిమా 'స్టూడెంట్‌ నెం.1' అవకాశం రావడానికి రచయిత పృథ్వీతేజ కారణం' అని చెప్పారు. 
 
ఇక ఇదే ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ.. విజయవాడ అనగానే తనకు కనకదుర్గ గుడి గుర్తుకు వస్తుందన్నారు. తన స్కూల్‌ ఫ్రెండ్స్‌ అందరూ గోదావరి జిల్లావాళ్లని భోజనం ఎక్కువగా పెడతారంటూ సరదాగా అన్నారు. తనకు అన్నిరకాల స్వీట్స్‌ అంటే ఇష్టమని తెలిపారు. 'కృష్ణమ్మ' సినిమా మంచి విజయం సాధించాలని రాజమౌళి కోరుకున్నారు. 
 
'కొరటాల శివ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారని తెలియగానే నా దృష్టి దీనిపై పడింది. దర్శకుడి మాటల్లోని నిజాయతీ ఈ సినిమాలోనూ ఉంటుందని నమ్ముతున్నా. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్లు సినిమా చూడాలనిపించేలా ఉన్నాయి. సత్యదేవ్‌ అద్భుతమైన నటుడని అందరికీ తెలుసు. అలాంటి నటుడికి ఒక సరైన సినిమా పడితే చాలు ఊహించని స్టార్‌డమ్‌ వస్తుంది. అది ఈ ‘కృష్ణమ్మ’ చిత్రంతో సాధ్యమవుతుందని నమ్ముతున్నా' అన్నారు. సత్యదేవ్‌ హీరోగా వి.వి.గోపాలకృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రం మే 10న విడుదల కానుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం 'హరి హర వీర మల్లు' మొదటి భాగం టీజర్ విడుదల