Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోట బొమ్మాళి పీఎస్‌ చిత్రం పొలిటికల్ సెటైర్ కాదు సిస్టమ్ లో జరిగేది చూపించాం : శ్రీకాంత్

Srikanth
, బుధవారం, 22 నవంబరు 2023 (15:51 IST)
Srikanth
రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ లీడ్‌ రోల్స్‌లో తేజ మార్ని తెరకెక్కించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్‌’. శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్‌ కుమార్ కీలకపాత్రలు పోషించారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు. నవంబర్ 24న సినిమా విడుదలవుతున్న సందర్భంగా హీరో శ్రీకాంత్ పలు విషయాలు తెలిపారు. 
 
"ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్. ఎక్కడైనా పోలీసులు క్రిమినల్స్ ని చేజ్ చేసి పట్టుకుంటారు. కానీ ఇందులో పోలీస్ చేజెస్ పోలీస్ కథ. పొలిటిషన్స్ పోలీసులను ఎలా వాడుకుంటారు? దానివల్ల పోలీసులకు ఎదురైన ఇబ్బందులు ఏమిటి అనేది మెయిన్ కాన్సెప్ట్. ఓటు బ్యాంకింగ్ కోసం కులాలను మతాలను రాజకీయ నాయకులు ఏ విధంగా వాడుకుంటారు అనేది ఇందులో స్పష్టంగా చూపించారు. సిస్టమ్ లో జరిగేది మాత్రమే చూపించారు.. కానీ పొలిటికల్ గా ఎలాంటి సెటైర్ ఉండదు. 
 
దర్శకుడు తేజ ఈ సబ్జెక్టును బాగా డీల్ చేశాడు.
తను కథ చెబుతున్నప్పుడే థ్రిల్ అయ్యాను. శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. స్టోరీ, స్క్రీన్ ప్లే చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. సినిమా ఎక్కడ బోర్ కొట్టనివ్వదు. 
 
హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ పాత్రలో నేను నటించాను. దీనికోసం శ్రీకాకుళం స్లాంగ్ కూడా నేర్చుకున్న. నేను రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్.. మా ముగ్గురి పాత్రల మధ్య కథ తిరుగుతుంటుంది. వరలక్ష్మి శరత్ కుమార్ మా పై ఆఫీసర్ గా ఉండి.. మమ్మల్ని పట్టుకోవడానికి చూస్తారు. వరలక్ష్మి వేసే ఎత్తులకు నేను పైఎత్తులు వేస్తూ ఉంటాను. 
 
అంతముందు నేను చేసిన సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్.. సాంగ్స్ ఫైట్స్ అన్ని ఉంటాయి.. ఇందులో చక్కటి ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటుంది. మిడిల్ క్లాస్ కానిస్టేబుల్ ఇంట్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంతయో అనేది ఉంటుంది. మలయాళం లో సూపర్ హిట్ అయిన నయట్టు చిత్రానికి ఇది రీమేక్ అయినా తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా చాలా మార్పులు చేశారు. ఈ మధ్య కాలంలో నేను చేసిన ఫుల్ లెంగ్త్ అవుట్ అండ్ అవుట్ క్యారెక్టర్ ఇది. పర్ఫార్మెన్స్ కి చాలా స్కోప్ ఉన్న పాత్ర పోషించాను. ఒరిజినల్ గా పోలీస్ ఎలా ఉంటారు.. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో.. నా పర్ఫామెన్స్ లెవెల్ కూడా అలాగే ఉంటుంది. టెక్నికల్ డిపార్ట్మెంట్ అంతా యంగ్ బ్యాచ్. చాలా స్ట్రాంగ్ గా దీన్ని రూపొందించారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్, ఎడిటింగ్ సహా అందరూ.. ప్యాషన్ తో వర్క్ చేశారు. అరకు వ్యాలీ లో ఎక్కువ భాగం షూట్. నైట్ టైం అడవిలో చెప్పులు లేకుండా పరిగెత్తడం, చేజింగ్ సీన్స్ కోసం చాలా కష్టపడ్డాం. 
 
ఇంతకుముందు చాలా సినిమాలు చేశాను కానీ ఇందులో చూసిన లొకేషన్స్ ని ఎక్కడ చూడలేదు. పాడేరు ప్రాంతలో బాగా డెప్త్ కి వెళ్లిపోయి మరీ షూట్ చేశాం. నాకు ఇది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లాంటిది.  
 
లింగిడి లింగిడి సాంగ్ రిలీజ్ అయిన తర్వాత సినిమాపై బజ్ బాగా పెరిగింది. సినిమా కూడా సక్సెస్ అవుతుందనే కాన్ఫిడెన్స్ మా అందరిలో ఉంది. ఏ ఆర్టిస్ట్ కి అయినా సిన్సియారిటీ ముఖ్యమని రాహుల్ కి, శివానికి చెప్పేవాడిని. రాహుల్ చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. తనను చూస్తే నా బిగినింగ్ డేస్ లో నన్ను నేను చూసుకున్నట్టు ఉంటుంది. మన తెలుగు అమ్మాయి శివాని కూడా మంచి మంచి క్యారెక్టర్లు చేస్తుంది. రాజకీయ నాయకుడిగా మురళీ శర్మ పోషించిన పాత్ర కీలకంగా ఉంటుంది. ఇందులో పాత్రతో పాటు, డైలాగ్స్ ఎమోషన్స్ అన్ని చాలా నేచురల్ గా ఉంటాయి. ఈ సినిమా కోసం నేను కూడా ఈగరగా వెయిట్ చేస్తున్నా. ప్రొడ్యూసర్స్ బన్నీ వాసు, విద్య చాలా క్లారిటీగా దీన్ని రూపొందించారు. 
 
ప్రస్తుతం రామ్ చరణ్ తో గేమ్ చేంజర్, ఎన్టీఆర్ తో దేవర చిత్రాలతో పాటు మోహన్ లాల్, మా అబ్బాయి రోషన్ నటిస్తున్న చిత్రంలోను కీలకపాత్ర పోషిస్తున్నా". 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐదు దశాబ్దాలకు దగ్గరగా నటనలో విలక్షణ చూపిన మోహన్ బాబు