Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ టైటిల్ చెన్నై లవ్ స్టోరీ

Advertiesment
Kiran Abbavaram, Sri Gowri Priya

దేవీ

, మంగళవారం, 3 జూన్ 2025 (10:18 IST)
Kiran Abbavaram, Sri Gowri Priya
కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా "కలర్ ఫొటో", "బేబి" దర్శక నిర్మాత సాయి రాజేశ్, ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీకి "చెన్నై లవ్ స్టోరీ" టైటిల్ ఖరారు చేశారు. ఈ రోజు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేతుల మీదుగా ఈ సినిమా టైటిల్ తో పాటు గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై సాయి రాజేశ్, ఎస్ కేఎన్ నిర్మిస్తున్నారు. సాయి రాజేశ్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు.
 
తొలి ప్రేమేం తోపు కాదు, ఫస్ట్ లవ్ ఫెయిలైతే బెస్ట్ లవ్ ఎక్కడో మొదలువుతుందని చెబుతూ సాగిన గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. ఈ గ్లింప్స్ లో హీరో కిరణ్ అబ్బవరం ఫ్రెష్ లుక్ లో కనిపిస్తున్నారు. శ్రీ గౌరి ప్రియ స్క్రీన్ ప్రెజెన్స్ ఇంప్రెస్ చేసింది. సముద్రపు ఒడ్డున ఈ జంట ఫస్ట్ లవ్, బెస్ట్ లవ్ గురించి మాట్లాడుకున్న సంభాషణ ఆసక్తికరంగా, ఆలోచింపజేసేలా సాగింది.

'తొలి ప్రేమకు మరణం లేదు' అనే "బేబి" సినిమాలోని ఫేమస్ డైలాగ్ ను హీరోయిన్ చెబుతూ తొలిప్రేమే గొప్పదని అంటుంది. అందుకు హీరో స్పందిస్తూ  'తొలి ప్రేమేం తోపు కాదు, ఫస్ట్ లవ్ ఫెయిలైతే బెస్ట్ లవ్ ఎక్కడో మొదలువుతుంది..' అని సమాధానం చెబుతాడు. అంతం వరకు అనంతమై సాగే ఈ జీవితంలో తొలి ప్రేమ ఒక మజిలీ మాత్రమేనని, అదే తుది కాదనే కాన్సెప్ట్ ను ఈ గ్లింప్స్ ద్వారా మేకర్స్ అందంగా తెలియజేశారు. ఈ గ్లింప్స్ కు 'తొలి ప్రేమే తోపు కాదే తోపు కాదే..' అంటూ మెలొడీ బ్రహ్మ మణిశర్మ బ్యూటిఫుల్ బీజీఎం సాంగ్ కంపోజ్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Nidhhi Agerwal: శింబుతో నిధి అగర్వాల్ ప్రేమాయణం.. పవన్ బ్యూటీ ఏం చెప్పిందంటే?