హీరోయిన్ రహస్యతో కిరణ్ అబ్బవరం నిశ్చితార్థం
, సోమవారం, 11 మార్చి 2024 (16:30 IST)
Kiran Abbavaram - rahasya
హీరో కిరణ్ అబ్బవరం వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. రాజావారు రాణిగారు సినిమాలో హీరోయిన్ గా తనతో కలిసి నటించిన రహస్యను ఆయన పెళ్లి చేసుకోనున్నారు. కిరణ్ అబ్బవరం, రహస్య గత ఐదేళ్లుగా ప్రేమించుకుని, రిలేషన్ షిప్ లో ఉంటున్నారు. ఈ వారమే ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వీరి ఎంగేజ్ మెంట్ జరగనుంది. తన జీవితాన్ని ఎప్పుడూ ప్రైవేట్ గా ఉంచుకుంటారు కిరణ్ అబ్బవరం. తన వ్యక్తిగత విషయాలు బయటకు ఫోకస్ కానివ్వరు.
Kiran Abbavaram - rahasya
ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్ గా, ప్రైవేట్ గా ఈ ఎంగేజ్ మెంట్ కార్యక్రమం జరగనుంది. ఈ నిశ్చితార్థం, పెళ్లికి సంబంధించిన తేదీలు, ఇతర వివరాలు త్వరలో కిరణ్ అబ్బవరం టీమ్ వెల్లడించనుంది. కెరీర్ పరంగా చూస్తే కిరణ్ అబ్బవరం ప్రస్తుతం "దిల్ రూబా" సినిమాతో పాటు 1970వ దశకం నేపథ్యంతో సాగే ఓ పీరియాడిక్ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రాల పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తారు.
తర్వాతి కథనం