కాటమరాయుడు ఎంత ఎక్కువగా ఏమీ లేదు.. నార్మల్‌గా ఉంది: కేసీఆర్ మనవడు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాటమరాయుడు చిత్రం కలెక్షన్ల పరంగా దుమ్మురేపుతోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను స్టామినాను రుజువు చేసే రీతిలో కాటమరాయుడు వంద కోట్ల మైలు రాయి వైపు దూసుకెళ్తున్నాడు. తొలిరోజు రూ.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాటమరాయుడు చిత్రం కలెక్షన్ల పరంగా దుమ్మురేపుతోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను స్టామినాను రుజువు చేసే రీతిలో కాటమరాయుడు వంద కోట్ల మైలు రాయి వైపు దూసుకెళ్తున్నాడు. తొలిరోజు రూ.55 కోట్లకు పైటా వసూలు చేసిన కాటమరాయుడు చిత్రం అదే ఊపును కొనసాగిస్తూ రెండో రోజు రూ. 30 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది.
తద్వారా తొలిరోజున టాలీవుడ్ రికార్డులన్నీంటిని కాటమరాయుడు తిరగరాసింది. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150 చిత్రం సాధించిన రూ.47 కోట్ల కలెక్షన్ల రికార్డును కాటమరాయుడు అధిగమించాడు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ మనుమడు మాత్రం కాటమరాయుడు సినిమా పెద్దగా లేదని.. నార్మల్‌గా ఉందని పబ్లిక్‌గా చెప్పేశాడు.
హైదరాబాద్‌లో జరిగిన సౌత్ ఇండియా సినిమా అవార్డుల కార్యక్రమం 'ఐఫా'లో పాల్గొనేందుకు వచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్, మనవడు, మునిసిపల్, ఐటీ మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు కాటమరాయుడు సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ, తాను లేటెస్టుగా 'కాటమరాయుడు' సినిమా చూశానని హిమాన్షు చెప్పాడు. కానీ "కాటమరాయుడు అంత ఎక్కువగా ఏమీ లేదు. నార్మల్‌గా ఉంది" అన్నాడు. ఈ వీడియోను పలువురు తమ ఫేస్ బుక్, ట్విట్టర్ ఎకౌంట్లలో షేర్ చేసుకుంటున్నారు.