Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముందు పొట్ట.. వెనుక బట్ట.. జబర్దస్త్ ఆదిపై మహేష్ కత్తి ఫైర్.. (వీడియో)

బిగ్‌బాస్ షో ద్వారా బాగా పాపులర్ అయిన మూవీ క్రిటిక్ మహేష్ కత్తి ఆ షో నుండి ఎలిమినేట్ అయిన తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్‌గా మారారు. దీంతో పవన్ అభిమానులు ఈ మూవీ క్ర

Advertiesment
ముందు పొట్ట.. వెనుక బట్ట.. జబర్దస్త్ ఆదిపై మహేష్ కత్తి ఫైర్.. (వీడియో)
, సోమవారం, 13 నవంబరు 2017 (17:30 IST)
బిగ్‌బాస్ షో ద్వారా బాగా పాపులర్ అయిన మూవీ క్రిటిక్ మహేష్ కత్తి ఆ షో నుండి ఎలిమినేట్ అయిన తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్‌గా మారారు. దీంతో పవన్ అభిమానులు ఈ మూవీ క్రిటిక్‌ను సోషల్ మీడియాలో ఓ ఆట ఆడేశారు. అంతటితో ఆపకుండా మహేష్ కత్తి తన నోటికి మరింత పని చెప్పి పవన్‌పై వ్యక్తిగత ఆరోపణలు చేశారు. 
 
అయినా పవన్ ఫ్యాన్స్ ఏమాత్రం వదలకపోవడంతో నోటికి బ్యాండేజ్ వేసుకున్న మహేష్ కత్తి.. మళ్లీ వార్తల్లో నిలిచాడు. సినిమాలపై రివ్యూలు రాసే వారిపై ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా అదే రివ్యూలు రాసే వారిపై ముఖ్యంగా మహేష్ కత్తిపై జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోలో పంచ్ డైలాగులు వేస్తూ క‌డుపుబ్బా న‌వ్వించే హైప‌ర్ ఆది సెటైర్లు వేశాడు. 
 
జబర్దస్త్‌లో హైపర్‌ ఆది స్కిట్‌లో భాగంగా ఇటీవ‌ల ఒక డైలాగు చెప్పాడు. వివాహం అనేది సినిమా తీసినంత కష్టం అని, కానీ ప్రేమ మాత్రం ముందు పొట్ట‌ వేసుకొని, వెనక బట్ట వేసుకొని రివ్యూలు రాసినంత ఈజీ కాదని మహేష్ కత్తిని దెప్పిపొడిచాడు. ఈ డైలాగు గురించి విన్న వెంటనే మహేష్ కత్తి కోపంతో ఫేస్ బుక్‌లో ఓ వీడియో పోస్టు చేశాడు. అవును తనకు పొట్ట వుందని.. బట్ట కూడా వుందన్నాడు. 
 
మనుషులు ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారన్నాడు. అదే ప్రపంచం అన్నాడు. అయింనంత మాత్రాన భిన్నంగా జోకర్స్ అయిపోతామా అంటూ ప్రశ్నించాడు. ఒకరు పొడుగ్గా, ఇంకొకరు పొట్టిగా, ఒకరు నల్లగా, ఇంకొకరు తెల్లగా ఉండొచ్చ‌ని, కొంద‌రికి నత్తి ఉండొచ్చ‌ని, కొంద‌రికి త‌న‌లా బట్టతల ఉండొచ్చని మహేష్ కత్తి అన్నాడు. ఇలా వున్నానని బాధపడలేదు. మనుషుల రూపాన్ని అపహాస్యం చేయడం కామెడీనా.. దాన్ని చూసి ఆనందపడటం మన దిగజారుడు తనమని ఏకిపారేశాడు. అయితే మహేష్ కత్తి వీడియోపై జబర్దస్త్ టీమ్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కీర్తి సురేష్‌ బాగానే బుట్టలో వేసుకుంటోంది! (వీడియో)