Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జబర్దస్త్ ఆదితో ఫోటో దిగిన కత్తి మహేష్.. వెధవలయ్యేది మీరే..

జబర్దస్త్ వేదికగా హైపర్ ఆది వేసిన ఓ స్కిట్ కత్తి మహేశ్‌కు కోపం తెప్పించింది. సినిమాలు తీయడం కష్టం. రివ్యూలు రాయడం ఏముంది. ముందు పొట్ట, వెనుక బట్ట ఉంటే చాలంటూ మొన్నటి జబర్దస్త్ షోలో ఆది పేల్చిన పంచ్‌లు

Advertiesment
జబర్దస్త్ ఆదితో ఫోటో దిగిన కత్తి మహేష్.. వెధవలయ్యేది మీరే..
, గురువారం, 16 నవంబరు 2017 (12:03 IST)
జబర్దస్త్ వేదికగా హైపర్ ఆది వేసిన ఓ స్కిట్ కత్తి మహేశ్‌కు కోపం తెప్పించింది. సినిమాలు తీయడం కష్టం. రివ్యూలు రాయడం ఏముంది. ముందు పొట్ట, వెనుక బట్ట ఉంటే చాలంటూ మొన్నటి జబర్దస్త్ షోలో ఆది పేల్చిన పంచ్‌లు తనను విమర్శించేలా ఉండటం పట్ల కత్తి మహేశ్ మండి పడ్డాడు. ఫేస్‌బుక్ లైవ్ ద్వారా ఆదిపై, జబర్దస్త్ షో‌పై కత్తి మహేశ్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో ఇది జరిగి కొన్ని రోజులు కూడా తిరగక ముందే అదే ఆదితో కలసి ఫొటో దిగాడు మహేష్. గురువారం హైదరాబాద్‌లో ''లండన్ బాబులు'' ప్రీమియర్ షోను చిత్ర యూనిట్ వేసింది. ఈ షోకు పలువురు సినీ ప్రముఖులతో పాటు కత్తి మహేష్, హైపర్ ఆది కూడా హాజరయ్యారు. ఈ సందర్బంగా వీరు ఫొటోలకు ఫోజులిచ్చారు. తాజాగా, ఈ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
 
ఈ సందర్భంగా పవర్ స్టార్ కల్యాణ్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి పలు కామెంట్స్ చేశాడు. తామంతా కలిసే వుంటాం. తమకు వ్యక్తిగత వైరాలు వుండవు. సిద్ధాంతాల పరంగా మాత్రమే విభేదాలు ఉంటాయి. ఈ విషయం తెలియక, అర్థం కాక ఫ్యాన్స్ అనే వాళ్లు వాళ్ల జీవితాలను నాశనం చేసుకుంటారు. నాయనలారా... మేలుకోండి. రేపో, మాపో పవన్ కల్యాణ్‌ను కలిసినా, ఇలాగే నవ్వుతూ ఫొటో దిగగలను. ఆ తర్వాత మీరే వెధవలు అవుతారు" అంటూ కామెంట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అర్జున్ రెడ్డి స్పూఫ్.. అరుణా రెడ్డి అయితే ఇలా ఉంటుంది (వీడియో)