Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జస్ట్ మిస్.. లేకుంటే కంగనా రనౌత్ మెడ తెగివుండేది... ఎందుకని?

బాలీవుడ్ హాట్ క్వీన్ కంగనా రనౌత్ పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. లేనిపక్షంలో ఆమె మెడ తెగిపోయి వుండేది. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాం. కంగనా రనౌత్ ప్రధాన పాత్రధారిగా ఝాన్సీ లక్ష్మీబాయి క‌థ‌తో

జస్ట్ మిస్.. లేకుంటే కంగనా రనౌత్ మెడ తెగివుండేది... ఎందుకని?
, గురువారం, 20 జులై 2017 (13:51 IST)
బాలీవుడ్ హాట్ క్వీన్ కంగనా రనౌత్ పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. లేనిపక్షంలో ఆమె మెడ తెగిపోయి వుండేది. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాం. కంగనా రనౌత్ ప్రధాన పాత్రధారిగా ఝాన్సీ లక్ష్మీబాయి క‌థ‌తో "మ‌ణికర్ణిక‌- ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ" అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం కోసం కంగ‌నా క‌త్తి యుద్ధాల‌లో శిక్షణ పొందింది. న‌టిగా ఇదే త‌న చివ‌రి సినిమా కావ‌డంతో ఈ మూవీపై చాలా శ్రద్ధ చూపిస్తోంది. ప్ర‌స్తుతం మ‌ణిక‌ర్ణిక‌ చిత్ర షూటింగ్ హైద‌రాబా‌ద్‌లో జ‌రుగుతోంది. స‌హ న‌టుడు నిహర్‌ పాండేతో కంగనా కత్తి సాము చేసే సీన్‌ను దర్శకుడు తెరకెక్కించాడు. 
 
అయితే ఈ సన్నివేశంలో కంగనాకు తృటిలో పెను ప్రమాదం తప్పిందని ఎముకకు దగ్గరగా కత్తి గుచ్చుకుందని వైద్యులు చెప్పినట్లు చిత్ర వర్గాలువెల్లడించాయి. కంగనా నుదుటికి 15 కుట్లు ప‌డ్డాయి. ప్ర‌స్తుతం వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్న కంగనా కొద్ది రోజులు షూటింగ్‌కి దూరం కానుంది. క‌త్తి ఫైటింగ్ కోసం డూప్ వాడుదామ‌ని చిత్ర నిర్మాత‌లు కంగనాకి చెప్పినప్ప‌టికి, ఆమె ససేమిరా అనండతో ఈ పరిస్థితి ఏర్పడింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జయ జానకి నాయక దర్శకుడితో అఖిల్ సినిమా?