జయలలిత బయోపిక్‌ను చేయాలనుకున్నప్పుడు ఆమె పాత్రను కంగనా రనౌత్ ను ఎంపిక చేశారు. ఇది తెలిశాక చాలామంది ఆమెను వద్దన్నారట.జయలలిత మేనల్లుడు దిలీప్ కూడా వ్యతిరేకించాడు. ఆ తర్వాత ఆయన్ను సముదాయించారు నిర్మాతలు. కానీ సినిమాలో టీమ్‌లో వారంతా దాదాపు 90 శాతం మంది ఆమెకే ఓటు వేశారని అందుకే ఆమెతోనే తలైవి సినిమా చేశామని నిర్మాత విష్ణు తెలియజేస్తున్నాడు. సినిమా విడుదలయ్యాక ఎవరైతే వద్దన్నారో వారే మరలా రీట్వీట్ చేస్తూ బాగా సెటెక్ట్ చేశారని అంటున్నారని ఆయన తెలియజేశారు. ఈ సినిమా థియేటర్లు తక్కువ శాతంలో విడుదలైనా పెట్టిన పెట్టబడికంటే మించి ఆదాయం వచ్చిందని తెలియజేస్తున్నాడు. ఎంత రేంజ్‌లో వచ్చిందనేదానికి ఆయన క్లారిటీ ఇవ్వలేకపోయాడు.
కానీ, సినిమాను ప్రేక్షకులు అనుకున్నట్లు పూర్తిగా తీయలేకపోయారనే విమర్శ వుంది. అందరూ సినిమా చూశాక పాజిటివ్‌గా చాలామంది స్పందిస్తే నెగెటివ్ గా మరికొందరు స్పందించారు. వారందరికీ నేను చెప్పేదొకటే మేం అనుకున్నట్లు సినిమా తీశాం. మీరనుకున్నట్లు ఎందుకు తీస్తామని ఆయన ఎదురు ప్రశ్నిస్తున్నారు. అయితే మొదటి భాగంలో కంగనా పాత్ర ఓకే అనిపించుకున్నా, రాజకీయాలల్లో వెళ్ళాక ఆ పాత్ర సూటు కాలేదని చాలామందిలో నెలకొంది. కంగనా పాత్రకు పలువురు హీరోయిన్లను సంప్రదించారు. అందులో విద్యాబాలన్ కూడా వుంది. కానీ ఎవ్వరూ ఆ పాత్రకు న్యాయం చేయలేమనీ, చేశాక తమిళనాడులో వ్యతిరేక వస్తుందని భయపడినట్లు తెలిసింది. అందుకే కంగనాను ఖరారుచేశారు. ఆమె కూడా మొదట్లో చేయనని చెప్పింది. కానీ దర్శకుడు విజయ్ ఆమెను ఒప్పించేలా చేశారు. ఇది జయలలిత బయోపిక్ అనే కంటే ఎంజీఆర్ పార్షియల్ బయోపిక్ అనడం కరెక్ట్.