Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'జనతా గ్యారేజ్'తో తారక్ గూబ గుయ్‌మనిపించాడు... కల్యాణ్ రామ్

'జనతా గ్యారేజ్' బాక్సీఫీస్ వద్ద బ్రేకుల్లేకుండా దూసుకుపోతోంది. డివైడ్ టాక్ వచ్చినా.. ఆ తర్వాత హిట్ టాక్‌తో కలెక్షన్ల సునామీని సృష్టించింది. తాజాగా దానికి సంబంధించిన సక్సెస్ మీట్‌ను ఎన్‌కన్వెన్షన్ సెంటర్‌లో అభిమానుల సమక్షంలో ఏర్పాటు చేశారు. ఈ మీట్‌లో

Advertiesment
kalyanram speech
, బుధవారం, 14 సెప్టెంబరు 2016 (13:55 IST)
'జనతా గ్యారేజ్' బాక్సీఫీస్ వద్ద బ్రేకుల్లేకుండా దూసుకుపోతోంది. డివైడ్ టాక్ వచ్చినా.. ఆ తర్వాత హిట్ టాక్‌తో కలెక్షన్ల సునామీని సృష్టించింది. తాజాగా దానికి సంబంధించిన సక్సెస్ మీట్‌ను ఎన్‌కన్వెన్షన్ సెంటర్‌లో అభిమానుల సమక్షంలో ఏర్పాటు చేశారు. ఈ మీట్‌లో ఎన్టీఆర్ చాలా ఉద్వేగానికి గురయ్యాడు. కానీ, అతడి అన్న కల్యాణ్ రామ్ మాత్రం కొంచెం భిన్నంగా స్పందించాడు. 
 
గూబ గుయ్‌మనేలా కొట్టాడంటూ వ్యాఖ్యానించాడు. ‘‘పదమూడేళ్ల నుంచి భారీ హిట్ కోసం చూస్తున్నాం. తారక్  ఎప్పుడు గూబ గుయ్‌మనేలా కొడతాడా అని ఎదురుచూస్తున్నాం. ప్రతి రోజూ దాని గురించే మాట్లాడుకునేవాళ్లం. ఇప్పుడు కొట్టాడు. దానికి మీరే (అభిమానులు) కారణం’’ అని అన్నాడు. తన తమ్ముడి హిట్ కోసం ఎన్నో ఏళ్ల నుంచి వేచి చూస్తున్నానని, అది అభిమానుల వల్ల ఇన్నాళ్లకు తీరిందని అన్నాడు. 
 
‘నాది, నా తమ్ముడి ఆకలి తీరింది. మరి మీ ఆకలి తీరిందా?’ అంటూ అభిమానులను ఉద్దేశించి అన్నాడు. ఆడియో ఫంక్షన్‌కు రావడం తనకు కుదరలేదని, ఫ్యాన్స్ ఉన్నారు కదా అన్న భరోసాతో ఉన్నానని చెప్పుకొచ్చాడు. నాడు రాకపోయినా.. సినిమా విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని కల్యాణ్‌రామ్ అన్నాడు. ఇంతమంచి హిట్ ఇచ్చినందకు డైరెక్టర్ కొరటాల శివకు, టెక్నీషియన్లు, చిత్ర బృందానికి కల్యాణ్ రామ్ కృతజ్ఞతలు తెలిపాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విఘ్నేష్ ఒడిలో నయనతార... ఓనమ్ సందడి... పెళ్లయిపోయిందా....?