Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిరు చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్ దేవ్ ప‌వ‌న్‌ని అందుకే కలవలేదట...

మెగాస్టార్ చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్‌ దేవ్ న‌టించిన తొలి చిత్రం విజేత‌. వారాహి చ‌ల‌నచిత్రం బ్యాన‌ర్ పైన సాయి కొర్ర‌పాటి ఈ సినిమాని నిర్మించారు. ఇటీవ‌ల విడుద‌లైన విజేత చిత్రానికి ప్రేక్ష‌కుల నుంచి ఆశించిన స్థాయిలో ఆద‌ర‌ణ ల‌భించ‌లేదు. అయిన‌ప్ప‌టిక

చిరు చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్ దేవ్ ప‌వ‌న్‌ని అందుకే కలవలేదట...
, బుధవారం, 18 జులై 2018 (14:38 IST)
మెగాస్టార్ చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్‌ దేవ్ న‌టించిన తొలి చిత్రం విజేత‌. వారాహి చ‌ల‌నచిత్రం బ్యాన‌ర్ పైన సాయి కొర్ర‌పాటి ఈ సినిమాని నిర్మించారు. ఇటీవ‌ల విడుద‌లైన విజేత చిత్రానికి ప్రేక్ష‌కుల నుంచి ఆశించిన స్థాయిలో ఆద‌ర‌ణ ల‌భించ‌లేదు. అయిన‌ప్ప‌టికీ మెగా హీరోలు మాత్రం ఈ సినిమాని ప్ర‌మోట్ చేస్తునే ఉన్నారు. చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్, అల్లు అర్జున్... ఇలా మెగా హీరోలు క‌ళ్యాణ్ దేవ్ కోసం రంగంలోకి దిగి ప్ర‌మోట్ చేస్తున్నారు. కానీ ఫ‌లితం శూన్యం. అది వేరే సంగ‌తి.
 
అయితే... ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మాత్రం ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి కార్య‌క్ర‌మంలోనూ పాల్గొన‌లేదు. తాజాగా జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ప‌వ‌న్ గురించిన ప్ర‌శ్న క‌ళ్యాణ్ దేవ్‌కు ఎదురైంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్  ప్ర‌స్తుతం రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్నారు. అందుకే మేము ఆయ‌న‌ను క‌ల‌వ‌లేదు. బిజీగా ఉన్న స‌మ‌యంలో వెళ్లి మా సినిమా కోసం ఆయ‌న్ని డిస్ట్ర‌బ్ చేయాల‌నుకోలేదు. ప‌వ‌న్‌ మా సినిమా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌కు రాక‌పోయినా.. ఆయ‌న ఆశీస్సులు మా సినిమాకు త‌ప్ప‌కుండా ఉంటాయి అన్నాడు క‌ళ్యాణ్ దేవ్. అదీ సంగ‌తి..!

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్టీఆర్ సరసన మహానటి.. చెర్రీ సరసన జిగేల్ రాణి.. జక్కన్న కన్ఫామ్ చేసేశాడా?