రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా సినిమా కల్కి 2898AD నుండి 'భైరవ గా పేరు పరిచయం చేస్తూ నేడు చిత్ర యూనిట్ పోస్టర్ విడుదల చేసింది. కాశీలో భవిష్యత్తులో వీధుల కల్కి ఈ అవతారంలో వుంటాడనేలా సూచిస్తున్నట్లు తెలియజేసేలా వుంది. నేడు మహాశవరాత్రి సందర్భంగా ప్రభాస్ లుక్ విడుదల చేశారు.
కల్కి సినిమాలో ప్రభాస్ పాత్ర పేరు భైరవ అని తెలిపారు. అయితే ఇంతకుముందు నుంచీ హాలీవుడ్ తరహాలో పోస్టర్లను విడుదల చేస్తూ ప్రభాస్ పేరు తెలియజేయలేదు. నేడు శివుడి అర్ధం వచ్చేలా భైరవ అనే పేరు ప్రకటించడంతో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో భారీ తారాగణంతో తీస్తున్నారు. హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ ఎపిసోడ్స్ వుండనున్నాయి. ఇటీవలే ఓ సాంగ్ ని ప్రభాస్, దిశా పటానితో ఇటలీ బీచ్ లో షూట్ చేశారు. ఈ సినిమాలోని పాయింట్ భారతం నుంచి వర్తమానం వరకు వుంటుందని తెలుస్తోంది. ఈ సినిమాను మే 9న రిలీజ్ కాబోతున్నట్టు కూడా వెల్లడించారు. ఇంకా ముందుముందు మరెన్ని సంగతులు రానున్నాయో చూడాలి.