ఐటమ్ సాంగ్‌లకు ససేమిరా అంటున్న అందాల భామ...
తెలుగు, తమిళ భాషలలో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన అందాల హీరోయిన్ కాజల్ అగర్వాల్. అనేక మంది అగ్రహీరోల సరసన నటించిన కాజల్.. గతంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన "జనతా గ్యారేజ్" చిత్రంలో ఐటమ్
తెలుగు, తమిళ భాషలలో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన అందాల హీరోయిన్ కాజల్ అగర్వాల్. అనేక మంది అగ్రహీరోల సరసన నటించిన కాజల్.. గతంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన "జనతా గ్యారేజ్" చిత్రంలో ఐటమ్ సాంగ్‌తో మెప్పించారు. ఆ తర్వాత ఆ తరహా పాటల్లో నటించలేదు. పలు ఆఫర్స్ కాజల్ తలుపు తట్టిన ఈ అమ్మడు రిజెక్ట్ చేస్తుందట.
తాజాగా ప్రముఖ దర్శకుడు స్పెషల్ సాంగ్ కోసం కాజల్‌ని సంప్రదించాడట. ఇందుకోసం ఫ్యాన్సీ రెమ్యునరేషన్ కూడా డిమాండ్ చేశాడని సమాచారం. అయితే దర్శకుడు ఇచ్చిన ఆఫర్‌ని కాజల్ ఏ మాత్రం ఆలోచించకుండా తిరస్కరించిందట. ప్రస్తుతం ప్రధాన పాత్రలపైనే బాగా దృష్టి సారిస్తున్న కాజల్ వీలైతే గెస్ట్ అప్పీయరెన్స్ ఇస్తానంటుంది.
బెల్లంకొండ శ్రీనివాస్ వంశధార క్రియేషన్స్ బేనర్‌పై శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుండగా ఇందులో కాజల్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా కోసం కాజల్‌కి భారీ మొత్తం ఆఫర్ చేశారట. ఇక తేజ త్వరలో బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ జంటగా ఓ సినిమా రూపొందించాలని భావిస్తున్నాడట. దీనిపై క్లారిటీ రావలసి ఉంది.