Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాహుబలి సినిమా కాదు... 'బాహుబలి-2'పై జూనియర్ ఎన్టీఆర్ స్పందన..

ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం విడుదలైన బాహుబలి 2 చిత్రంపై హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. 'బాహుబలి-2' సినిమా అఖండ విజయం సాధించడం పట్ల సినీ ప్రముఖులు నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. ముఖ్యంగా రాజమౌళితో

Advertiesment
Baahubali 2
, శుక్రవారం, 28 ఏప్రియల్ 2017 (11:17 IST)
ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం విడుదలైన బాహుబలి 2 చిత్రంపై హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. 'బాహుబలి-2' సినిమా అఖండ విజయం సాధించడం పట్ల సినీ ప్రముఖులు నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. ముఖ్యంగా రాజమౌళితో కలసి హ్యాట్రిక్ హిట్ కొట్టిన జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాను ఆకాశానికెత్తేశాడు. 
 
ఇది కేవలం తెలుగు సినిమా మాత్రమే కాదని... భారతీయ సినిమా ఖ్యాతిని సరికొత్త ఎత్తులకు తీసుకెళ్లిన గొప్ప చిత్రమని కితాబిచ్చాడు. రాజమౌళి కల నిజరూపం దాల్చేందుకు సహకరించిన శోభు, ప్రసాద్, నటీనటులు, టెక్నీషియన్స్ కు ధన్యవాదాలు తెలిపాడు. అద్భుత నటనతో సినిమాకు ప్రాణం పోసిన ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణలకు హ్యాట్సాఫ్ అంటూ ట్వీట్ చేశాడు.
 
అలాగే, ఫ్యాన్స్ స్పందిస్తూ... తొలి భాగం కంటే 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' ఎంతో బాగుందని అంటున్నారు. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. పాటలు బాహుబలి 1 అంతటి స్థాయిలో వీనుల విందుగా లేకున్నప్పటికీ, విజువల్స్ పరంగా అద్భుతంగా ఉన్నాయని చెప్పారు.
 
తొలి భాగంలో అనుష్క డీ గ్లామర్ గా కనిపిస్తే, రెండో భాగంలో యువరాణిగా బాగుందని కితాబునిచ్చారు. రాక్షసుడిగా భల్లాల దేవుడు భయపెడితే... యువరాజుగా మహేంద్ర బాహుబలి ఆకట్టుకున్నాడని వారు చెబుతున్నారు. తొలి భాగం కంటే విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయని, రెండు భారీ ఫైట్లు సినిమాకు ఆకర్షణ అని, ప్రభాస్, రానా పోటీ పడి నటించారని ఈ సినిమా చూసిన అభిమానులు చెబుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కూకట్‌పల్లి భ్రమరాంబ థియేటర్‌లో బాహుబలి టీం సందడి...