Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తమ్మారెడ్డి భరద్వాజ నిర్మాణ సారధ్యంలో జర్నీ టు అయోధ్య- వ‌ర్కింగ్ టైటిల్‌

Advertiesment
Journey to Ayodhya working title poster

డీవీ

, బుధవారం, 17 ఏప్రియల్ 2024 (16:37 IST)
Journey to Ayodhya working title poster
జగదభిరాముడు, సకల గుణధాముడు..ధర్మ రక్షకుడు, ఏకపత్నివ్రతుడైన అయోధ్య రామయ్యను స్మరిస్తూ అనంత కోటి భక్తజనం అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండగ శ్రీరామనవమి. ఈ ప‌ర్వ‌దినాన‌ ప్యాష‌నేట్ ప్రొడ్యూస‌ర్ వేణు దోనేపూడి త‌న చిత్రాల‌యం స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.2ను అనౌన్స్ చేశారు. ‘జర్నీ టు అయోధ్య’ అనేది వ‌ర్కింగ్ టైటిల్.  ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వి.ఎన్‌.ఆదిత్య క‌థ‌ను అందిస్తున్నారు.
 
రామాయ‌ణంపై, రామాయ‌ణంను ఆధారంగా చేసుకుని ఇప్ప‌టి వ‌ర‌కు చాలా సినిమాలు వ‌చ్చాయి. ఎంద‌రో గొప్ప గొప్ప న‌టీన‌టులు సీతా రాములుగా, రావ‌ణ‌, ల‌క్ష్మ‌ణ‌, ఆంజ‌నేయులుగా న‌టించి ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. ఇప్పుడు అదే బాట‌లో రామాయ‌ణంను తెర‌కెక్కించ‌టానికి నిర్మాత వేణు దోనేపూడి సిద్ధ‌మ‌య్యారు. వి.ఎన్‌.ఆదిత్య‌ నేతృత్వంలో ఒక‌ టీమ్ ఈ చిత్రానికి సంబంధించి అయోధ్య స‌హా ప‌లు చోట్ల‌ లోకేషన్స్ రెక్కీ నిర్వహిస్తున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.
 
ఒక యంగ్ డైరెక్ట‌ర్ దర్శకత్వంలో  తెర‌కెక్కించ‌బోతున్న ఈ సినిమాలో న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌న్నారు మేక‌ర్స్‌. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో,  భారీగా నిర్మించబోతున్న ఈ ప్యాన్ ఇండియా చిత్రానికి నిర్మాణ సారధ్యం తమ్మారెడ్డి భరద్వాజ.
 
ప్ర‌స్తుతం చిత్రాల‌యం స్టూడియోస్ బ్యాన‌ర్ పీపుల్ మీడియా బ్యాన‌ర్‌తో క‌లిసి గోపీచంద్‌, శ్రీనువైట్ల కాంబినేష‌న్‌లో ‘విశ్వం’ సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిత్రవాహిని, ఆర్ వై జి బ్యానర్‌ ల సరి కొత్త టైటిల్ టుక్ టుక్