Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీదేవిని చూడాలనిపించలేదు.. కనీసం టీవీ కూడా చూడలేదు : జయసుధ

హఠాన్మరణం చెందిన శ్రీదేవిని కనీసం చూడాలని అనిపించలేదనీ, అందుకే టీవీ కూడా అన్ చేయలేదని సహజనటి జయసుధ చెప్పారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో లెజండరీ నటి శ్రీదేవికి నివాళులు ఆర్పిస్తూ

Advertiesment
Jayasudha
, మంగళవారం, 6 మార్చి 2018 (11:12 IST)
హఠాన్మరణం చెందిన శ్రీదేవిని కనీసం చూడాలని అనిపించలేదనీ, అందుకే టీవీ కూడా అన్ చేయలేదని సహజనటి జయసుధ చెప్పారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో లెజండరీ నటి శ్రీదేవికి నివాళులు ఆర్పిస్తూ.. టాలీవుడ్ చిత్ర పరిశ్రమ సంతాప సభను నిర్వహించింది. ఇందులో జయసుధ పాల్గొని మాట్లాడుతూ, సహచర నటి శ్రీదేవి మరణించారన్న వార్తను ఇప్పటికీ జీర్ణించుకోలేపోతున్నట్టు చెప్పారు. 
 
శ్రీదేవి మరణవార్త కలచివేసింది. నాకేదో అయిపోతోందన్న భయం వచ్చేసింది. అందుకే చనిపోయిన శ్రీదేవి ముఖాన్ని చూడాటానికి ఇష్టపడలేదు. కనీసం టీవీ కూడా ఆన్ చేయలేదు. అయితే, అంత్యక్రియల సమయంలో కేవలం 20 సెకన్లు మాత్రమే టీవీ ఆన్ చేసి శ్రీదేవి ముఖాన్ని చూశాను. ఆమె పార్థివ దేహం చూస్తుంటే చిన్నప్పటి శ్రీదేవిలా కనిపించిందని చెప్పుకొచ్చింది. 
 
ఇకపోతే, ఆమెతో కలిసి 9-10 సినిమాల్లో నటించాను. బాల సూపర్‌స్టార్‌గా ఉన్నప్పుడు శ్రీదేవిని చాలాసార్లు చూశాను. బాలనటిగా ఉన్నప్పుడు.. తనని చూడ్డానికి ప్రత్యేకంగా ఆమె ఇంటికి వెళ్లా. అలా నేను చూసిన మొదటి నటి ఆమె. తనతో కలిసి హీరోయిన్‌గా కూడా నటించాను. మా ఫ్యామిలీతో తనకు మంచి అనుబంధం ఉండేదని చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలీవుడ్ సీనియర్ నటి షమ్మి కన్నుమూత