జయలలిత బయోపిక్‌లో ఐశ్వర్య రాయ్: అమ్మ రోల్‌లో ఆమెకే ఆఫర్ వస్తుందా?
దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అమ్మ బయోపిక్ గురించి చర్చలు జరుగుతున్నాయి. కానీ అమ్మ రోల్‌లో రమ్యకృష్ణ, త్రిష కనిపిస్తారని జోరుగా ప్రచారం సాగి
దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అమ్మ బయోపిక్ గురించి చర్చలు జరుగుతున్నాయి. కానీ అమ్మ రోల్‌లో రమ్యకృష్ణ, త్రిష కనిపిస్తారని జోరుగా ప్రచారం సాగింది. అయితే, అమ్మ స్థానం ఐశ్వర్యదే అంటున్నారు. గతంలో మణిరత్నం తీసిన 'ఇద్దరు' జయలలిత పాత్రని ఐష్ పోషించింది. ఐష్‌కి అదే తొలిచిత్రం కావడం విశేషం.
అంతేగాకుండా.. తన బయోపిక్ తీస్తే.. తన పాత్రలో ఐశ్వర్యారాయ్ కరెక్ట్‌గా సరిపోతుందని స్వయంగా జయలలితనే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దీంతో అమ్మ ఆశకు ప్రాధాన్యత ఇవ్వాలని దర్శకులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా అమ్మ బయోపిక్‌లో ఐశ్వర్యను తీసుకోవాలనుకుంటున్నారు. ఇప్పటికే 'అమ్మ' బయోపిక్ ని ప్రకటించాడు దర్శకరత్న దాసరి.
అయితే, అమ్మగా కనిపించబోయే హీరోయిన్ ఎవరనేది ఇంకా చెప్పలేదు. ఇక, దర్శకుడు ఫైజల్‌సైఫ్ కన్నడ హీరోయిన్ రాగిణీ ద్వివేది హీరోయిన్‌గా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో 'అమ్మ' పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్రయత్నాలు స్టార్ట్ చేశాడు. అయితే అమ్మ కోరిక మేరకు ఐశ్వర్యారాయ్‌ని జయలలితగా ఎవరు సినిమా తీస్తారనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది.