అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'పుష్ప-1', 'పుష్ప-2' చిత్రాలు విజయభేరీ మోగించాయి. పుష్ప-2 ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. తాజాగా మరో 20 నిమిషాల ఫుటేజీని జోడించారు. 'పుష్ప-2' రీలోడెడ్ వెర్షన్ పేరుతో ఈ ఫుటేజీని జతచేశారు. ఈ క్రమంలో ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతుందనే ప్రచారం టాలీవుడ్‌లో జోరుగా సాగుతుంది. ఈ రీలోడెడ్ వెర్షన్‌కు కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక ఈ సినిమాలో అదనంగా కలిపిన 20 నిమిషాల సీన్స్‌ను కూడా వాళ్లు ఎంజాయ్ చేస్తున్నారని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. ఇక సినిమా ఆఖరులో పుష్ప-3 అయితే ఉంటుందని మేకర్స్ తెలియజేశారు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం మేరకు.. "పుష్ప-3" ఖాయమని తెలుస్తుంది. ఈ చిత్రంలో విలన్‌గా జగపతి బాబు నటించబోతున్నారనే ప్రచారం చక్కర్లు కొడుతుంది. అలాగే, పుష్పరాజ్ తన తమ్ముడుని అలాగే, తమ్ముడు కొడుకుని చంపాడు కాబట్టి, అతని మీద రీవేంజ్ తీర్చుకోవడానికి ఆయన భారీ ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక 'పుష్ప' మూడో భాగం సినిమా కూడా చాలా రసవత్తరంగా ఉండబోతుందన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా, అల్లు అర్జున్, జగపతిబాబు మధ్య టగ్ ఆఫ్ వార్‌గా ఈ చిత్రాన్ని చూడొచ్చని చెబుతున్నారు. అయితే, ఈ మూడో భాగాన్ని సెట్స్‌పైకి ఎపుడు తీసుకెళతారోనన్న విషయం మాత్రం ఇంకా ఓ క్లారిటీ మాత్రం లేదు.