Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ హీరోయిన్‌పై మనసుపడింది.. అడిగినదానికంటే రూ.10 లక్షలు ఎక్కువిస్తా...

వివాదాస్ప దర్శకుడు రాంగోపాల్ వర్మ తన తదుపరి ప్రాజెక్టుపై దృష్టిసారించారు. ఆ మధ్య జీఎస్టీ పేరుతో ఓ వెబ్ సిరీస్‌ను తీసి చిక్కుల్లో చిక్కుకున్న ఆయన.. ప్రస్తుతం అక్కినేని నాగార్జుతో పోలీస్ నేపథ్యంతో కూడిన

Advertiesment
Ram Gopal Varma
, గురువారం, 29 మార్చి 2018 (12:55 IST)
వివాదాస్ప దర్శకుడు రాంగోపాల్ వర్మ తన తదుపరి ప్రాజెక్టుపై దృష్టిసారించారు. ఆ మధ్య జీఎస్టీ పేరుతో ఓ వెబ్ సిరీస్‌ను తీసి చిక్కుల్లో చిక్కుకున్న ఆయన.. ప్రస్తుతం అక్కినేని నాగార్జుతో పోలీస్ నేపథ్యంతో కూడిన చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. 
 
ఇపుడు తాజాగా, తన తదుపరి సినిమా కాస్టింగ్‌ను ప్రకటిస్తూ ఆసక్తి రేపాడు. ఇప్పటికే అక్కినేని అఖిల్‌తో సినిమాను ప్రకటించిన వర్మ, తన తర్వాతి సినిమా హీరోయిన్‌ను కూడా ప్రకటించాడు. ప్రముఖ కన్నడ నటుడు శివరాజ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో రూపొందిన 'టగరు' సినిమాను చిత్రయూనిట్‌తో కలిసి వర్మ వీక్షించాడు. 
 
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ చిత్రంలో నటించిన హీరోయిన్ మాన్విత హరీష్‌పై మనసుపడిందన్నారు. ఈమె కేవలం ఒక కథానాయిక మాత్రమే కాదన్నాడు. ఈ సినిమాలో ఆమె తన నటనతో అందరినీ విస్మయానికి గురిచేస్తుందని చెప్పుకొచ్చాడు. ఆమెను తన తదుపరి సినిమాకు హీరోయిన్‌గా ఎంచుకుంటున్నానని చెప్పాడు. ఆ సినిమాకు ఆమె అడిగిన పారితోషికం కంటే 10 లక్షల రూపాయలు ఎక్కువ ఇస్తానని ప్రకటించారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రజనీకాంత్ సరసన నయనతార?: అంజలి, త్రిషను పక్కనబెట్టేసిన టీమ్?