Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మెగాస్టార్‌కి ఐకన్ స్టార్‌కి అదే తేడా? అక్కడే దెబ్బ కొడుతోంది

Chiranjeevi, Allu Arjun

ఐవీఆర్

, మంగళవారం, 24 డిశెంబరు 2024 (13:17 IST)
ఇప్పుడు టాక్ ఆఫ్ టాలీవుడ్ ఇండస్ట్రీ అల్లు అర్జున్ (Allu Arjun) అనే సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందడం ఆమె కుమారుడు ప్రాణాల కోసం పోరాడుతుండటం ఐకన్ స్టార్ అల్లు అర్జున్‌ని ఇబ్బందుల్లో పడేసింది. ఈ నేపధ్యంలో అల్లు అర్జున్ వ్యవహార శైలి గురించి కూడా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. సినీ మీడియాకి చెందిన కొన్ని ఛానళ్లు ఐకన్ స్టార్‌కి మద్దతుగా వుంటే మరికొన్ని ఛానళ్లు ఆయన వ్యవహార శైలిని తప్పుబడుతున్నాయి. ఈ క్రమంలో అల్లు అర్జున్ స్వయానా మేనమామ అయిన మెగాస్టారును పోల్చి చెప్పుకుంటున్నారు.
 
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్, పవర్ స్టార్, సూపర్ స్టార్, యంగ్ టైగర్, ప్రిన్స్, రెబల్ స్టార్, మెగా పవర్ స్టార్, మాస్ మహరాజా... ఇలా ఎంతోమంది స్టార్లు వున్నారు. ఐతే వాళ్లంతా తమ బిరుదులను ఛాతీలపై వేసుకుని తిరగడంలేదు. ఉదాహరణకు మెగాస్టార్ చిరంజీవి... చిన్న హీరోలకు సంబంధించి ఏ చిన్న ఫంక్షనుకి పిలిచినా వెళ్లి వారి చిత్రాల కంటెంట్ గురించి చెప్పి ప్రేక్షకులను వారి చిత్రాలను థియేటర్లలో చూడమని కోరుతుంటారు. అలా మిగిలిన స్టార్స్ కూడా చేస్తుంటారు.
 
అలాగే... పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అయితే తను హీరోగా ఉన్నతస్థానంలో వుండగానే ప్రజా సేవ చేయాలని నిర్ణయించుకుని రాజకీయాల్లోకి వచ్చి, పేదల అభ్యున్నతి కోసం కొండలు కోనల్లో ఎలాంటి భేషజాలకు తావు లేకుండా ముందుకు సాగారు. స్టార్లు కావచ్చు, లీడర్లు కావచ్చు... లోప్రొఫైల్ మెయిన్‌టైన్ చేస్తుంటేనే ప్రజల్లో వారికి మంచి ఆదరణ లభిస్తుంటుంది. ఫ్యాన్స్ హీరో మేనరిజం చూస్తుంటారు, అనుకరిస్తుంటారు కానీ ప్రజలు అలాక్కాదు. అన్ని కోణాల్లోనూ గమనిస్తుంటారు. అలా ప్రజల హృదయాలను గెలుచుకున్న హీరోలు కొందరు మాత్రమే వుంటారు. అల్లు అర్జున్ కూడా లోప్రొఫైల్ అనుసరిస్తూ అందరికి నచ్చే వ్యక్తిగా నిలబడాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి మాత్రం ఆయన తన అభిమానులకు మాత్రమే ఐకన్ స్టార్... అంతే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Pushpa 2: ఆ సీన్‌ను తొలగించండి.. 10శాతం విరాళంగా ఇవ్వండి.. తీన్మార్ మల్లన్న