Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సుల్తాన్‌పై సల్మాన్ రేప్ విక్టిమ్ వ్యాఖ్యలు: సీన్లోకి ప్రేయసి లులియా.. ఏం చెప్పిందో తెలుసా?

''సుల్తాన్'' సినిమా షూటింగ్ సమయంలో ప్రతిరోజూ షూటింగ్ ముగించుకుని ఇంటికెళ్లేటప్పుడు అత్యాచారానికి గురైన మహిళ తరహాలో తన పరిస్థితి ఉండేదని బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ వ్యాఖ్యానించడం పెను దుమారాన్నే

Advertiesment
Iulia Vantur
, బుధవారం, 29 జూన్ 2016 (17:28 IST)
''సుల్తాన్'' సినిమా షూటింగ్ సమయంలో ప్రతిరోజూ షూటింగ్ ముగించుకుని ఇంటికెళ్లేటప్పుడు అత్యాచారానికి గురైన మహిళ తరహాలో తన పరిస్థితి ఉండేదని బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ వ్యాఖ్యానించడం పెను దుమారాన్నే రేపింది. ఈ వ్యాఖ్యలపై సల్మాన్ ఖాన్ ప్రేయసి వంతుర్ లులియా కూడా స్పందించిందట. ఓ ఇంగ్లీష్ పత్రిక ప్రచురించిన కథనం ప్రకారం లులియా కూడా సల్మాన్ ఖాన్ వ్యాఖ్యల పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిందట. 
 
సల్మాన్ ఖాన్ అలా మాట్లాడి ఉండకూడదని కూడా అభిప్రాయపడిందట. ప్రజలకు సంబంధించిన విషయాలను మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని, నోరు జారకుండా ఉండాలని కూడా సూచించిందట. సమాజంలో ఇలాంటి వ్యాఖ్యలు పేరు ప్రతిష్టలకు భంగం కలిగించేవిగా ఉంటాయని తెలిపిందట. ఇకపై ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాల్సిందిగా క్లాస్ పీకిందట.
 
లులియా హితబోధతోనే సల్మాన్ ఖాన్.. సినీ ప్రోగ్రాముల్లో పాల్గొన్నప్పటికీ పరిమితంగా మాట్లాడుతున్నాడని తెలిసింది. కాగా అతి త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని బిటౌన్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో లులియా వ్యాఖ్యలకు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నటసింహ నందమూరి బాలకృష్ణ 101వ చిత్రం `రైతు`