నందమూరి నట సింహం బాలకృష్ణ - ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని జయ జానకి నాయక చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. బాలయ్య, బోయపాటి కలిసి సింహా, లెజెండ్ చిత్రాలు చేయడం.. ఆ రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్స్ కావడంతో వీరిద్దరూ కలిసి హ్యాట్రిక్ మూవీ ఎప్పుడు చేస్తారా..? అని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా స్టార్ట్ అవ్వడంతో ఈ ప్రాజెక్ట్ పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
అయితే.. ఈ సినిమా గురించి ఇప్పుడో ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అది ఏంటంటే.. ఇందులో బాలయ్యకు సన్నిహితంగా ఉండే పాత్ర ఒకటి ఉందని.. ఆ పాత్రను ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేమ్ నవీన్ పొలిశెట్టి పోషిస్తున్నారని వార్తలు వచ్చాయి.
అయితే... ప్రచారంలో ఉన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని.. ఆ వార్తలను నవీన్ ఖండిచారు. తాజా వార్త ఏంటంటే... బాలయ్యకు సన్నిహితంగా ఉండే ఆ పాత్రను వంగవీటి, జార్జిరెడ్డి చిత్రాల ఫేమ్ సందీప్ మాధవ్ పోషిస్తున్నారని తెలిసింది. వంగవీటి, జార్జిరెడ్డి చిత్రాలతో సందీప్ మంచి పేరు సంపాదించుకున్నాడు. ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.
బాలయ్యతో కలిసి నటించే అవకాశం కావడంతో వెంటనే ఓకే చెప్పాడని.. ఈ పాత్ర చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. మరి.. ఈ సినిమాతో సందీప్ మరింతగా ఆకట్టుకుంటాడేమో చూడాలి.