రీల్ లైఫ్‌లో హీరోయిన్నే.. కానీ రియల్ లైఫ్‌లో వేధిస్తే హీరోను: తాప్సీ ధైర్యమే ధైర్యం
రీల్ లైఫ్‌లో మాత్రం నేను ఎప్పటికీ హీరోయిన్నే.. కానీ రియల్ లైప్ విషయానికి వచ్చే సరికి నన్నెవడైనా వేధించాడంటే వాడి తాట తీసేవరకు ఊరుకోని హీరోనే అంటూ తాప్సీ నటిగా, జీవితంలో వ్యక్తిగా తనలో ఉంటే తేడాను విప్పి చెప్పింది.
రీల్ లైఫ్‌లో మాత్రం నేను ఎప్పటికీ హీరోయిన్నే.. కానీ రియల్ లైప్ విషయానికి వచ్చే సరికి నన్నెవడైనా వేధించాడంటే వాడి తాట తీసేవరకు ఊరుకోని హీరోనే అంటూ తాప్సీ నటిగా, జీవితంలో వ్యక్తిగా తనలో ఉంటే తేడాను విప్పి చెప్పింది. సినిమాల్లో అడుగుపెట్టిన కొత్తలో శ్రుతిహసన్ లాగే ఐరన్ లెగ్‌గా పేరుపడి అన్ని అవమానాలకు గురైన తాప్సీ బాలీవుడ్‌లో పింక్ సినిమా తర్వాత ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ రోజు ఈ స్థితిలో ఉన్నానంటే నట జీవితంలో తానెదుర్కొన్న భయంకరమైన అనుభవాలే కారణమని చెబుతోంది. హీరోయిన్‌గా బారీ రెమ్యునరేషన్ ఆశించడం కాదు కదా కనీస మొత్తం అడిగి దాన్ని వసూలు చేసుకోవడానికే యుద్ధం చేయవలసి వచ్చిందని తాప్సీ ఆవేదన వ్యక్తం చేశారు.
పాకెట్ మనీ కోసం మోడల్‌గా అవతారమెత్తిన తనకు సినిమా అవకాశాలు అనుకోకుండా వచ్చాయి కానీ మొదట్లో తను నటించిన సినిమాలు ఆడక, సినిమా పోవడానికి తానే కారణమనే అపనిందలను ఎన్నింటినో భరించానని ఎవరినీ నమ్ముకుని యాక్టింగ్ ఫీల్డ్‌కి రాలేదని తాప్సీ చెప్పారు. కేవలం ప్రతిభను నమ్ముకునే వచ్చానని, స్వేచ్ఛగా, స్ట్రాంగ్‌గా బతకాలనుకుంటానంటున్న తాప్సీ నిజజీవితంలో మాత్రం తనను ఎవరైనా వేధించడానికి ప్రయత్నిస్తే అంతు చూస్తానని అంటున్నారు.
తన జీవితంలో అలాంటి ఘటన ఇటీవలే చోటు చేసుకుందని తాప్సీ చెప్పారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెల్లి జనం తాకిడికి గురైన సమయంలో వెనుకనుంచి ఎవరో నన్ను వేలితే తాకేందుకు ప్రయత్నించడం గమనించి అతగాడి వేలును పట్టుకుని లాగి మెలి తిప్పి అతడు అబ్బా అనేంతవరకు వదలలేదట. అందుకే తాను సినిమాల్లో మాత్రమే బేల హీరోయిన్నని, నిజ జీవితంలో మాత్రం హీరోగానే వ్యవహరిస్తానని తాప్సీ స్పష్టం చేశారు.
ఈ సారి ఏదైనా కార్యక్రమంలో తాప్సీ పాల్గొన్నప్పుడు ఆమెను తాకాలని, కానీ, గిల్లాలని గానీ ఎవరైనా భావిస్తే, ఒకసారి హీరో తాప్సీని గుర్తు పెట్టుకోండి చాలు.