Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

NTR: హృతిక్, ఎన్టీఆర్‌. ను కలిసి చూడాలంటే వార్ 2 తెరపైనే

Advertiesment
Hrithik, NTR

దేవీ

, బుధవారం, 2 జులై 2025 (13:20 IST)
Hrithik, NTR
YRF స్పై యూనివర్స్ సినిమాలను యష్ రాజ్ ఫిల్మ్స్ ఎప్పుడూ కూడా ప్రత్యేకంగా ప్రమోట్ చేస్తుంటాయి. ఈ మేరకు YRF ప్రత్యేకమైన వ్యూహాలను అమలు చేస్తుంటుంది. ‘వార్ 2’లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ తొలిసారిగా తెరపైకి కలిసి రాబోతోన్నారు. ఈ క్రమంలో YRF ప్రమోషన్ల విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటోంది. ఇద్దరితో సపరేట్‌గా ప్రమోషన్స్ చేయించాలని టీం భావిస్తోంది.
 
‘హృతిక్, ఎన్టీఆర్ కలిసి ‘వార్ 2’ని ప్రమోట్ చేయరు. ఏ ఈవెంట్‌లో గానీ ఈ ఇద్దరూ కలిసి కనిపించరు. అసలు ‘వార్ 2’ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ ఆ ఇద్దరు. అలాంటిది ఆ ఇద్దరినీ ఒకే సారి చూడాలంటే అది తెరపైనే చూడాలి. అంతే గానీ ప్రమోషన్స్‌లో ఏ ఒక్క చోట కూడా ఈ ఇద్దరూ కలిసి కనిపించరు. నేరుగా తెరపైనే ఆ ఇద్దరినీ ఒకే సారి చూస్తేనే ఆ థ్రిల్ ఉంటుంది’ అని యష్ రాజ్ ఫిల్మ్స్ టీం అనుకుంటోందని ఓ సీనియర్ ట్రేడ్ అనలిస్ట్ చెప్పుకొచ్చారు.
 
‘YRF స్పై యూనివర్స్ ఎప్పుడూ కూడా తమ సినిమాలను ప్రత్యేకంగా ప్రమోట్ చేస్తుంటుంది. ‘వార్’ విషయంలోనూ ఇలాంటి ఓ స్ట్రాటజీనే ఫాలో అయింది. సినిమా రిలీజ్‌కు ముందు ఎక్కడా కూడా ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. హీరోలిద్దరూ కలిసి కనిపించలేదు. ‘వార్’ సక్సెస్ సెలెబ్రేషన్స్‌లోనే హీరోలిద్దరూ కనిపించారు. ‘పఠాన్’ విషయంలో షారుఖ్ ఖాన్ కూడా ఇదే పద్దతిని ఫాలో అయ్యారు. ఎటువంటి ప్రమోషన్ కార్యక్రమాలు చేయకుండానే సినిమాపై బజ్‌ను పెంచారు. చివరకు ‘పఠాన్’ ఆల్-టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ‘టైగర్ జిందా హై’, టైగర్ ఫ్రాంచైజ్ YRF స్పై యూనివర్స్‌ను ఎలా ప్రమోట్ చేశారో.. ఇతర ఏజెంట్లను పట్టుకొచ్చి ప్రమోట్ చేశారో.. అవన్నీ చూసి ప్రజలంతా ఆశ్చర్యపోయిన సంగతి తెలిసిందే కదా’ అని ఓ సీనియర్ ట్రేడ్ అనలిస్ట్ చెప్పుకొచ్చారు.
 
2025లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రంగా ‘వార్ 2’ నిలుస్తుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ‘వార్ 2’ ఆగస్టు 14, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ‘వార్ 2’ను ఆదిత్య చోప్రా నిర్మించారు.ఈ చిత్రంతో కియారా అద్వానీ  YRF స్పై యూనివర్స్‌లో చేరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Komali Prasad: అవాస్తవాల్ని నమ్మకండి అసత్యాల్ని ప్రచారం చేయకండి - కోమలి ప్రసాద్