Sudhakar Komakula, sekar kammula, aamani
లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్:ఫెమ్ సుధాకర్ కోమాకుల హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ నారాయణ అండ్ కో. ఇటివలే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. చిన్న పాపిశెట్టి దర్శకత్వం వహిస్తుండగా, పాపిశెట్టి ఫిల్మ్ ప్రొడక్షన్స్, సుఖ మీడియా బ్యానర్‌లపై పాపిశెట్టి బ్రదర్స్‌తో కలిసి సుధాకర్ కూడా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సినిమా టీజర్‌ను దర్శకుడు శేఖర్ కమ్ముల లాంచ్ చేశారు. టీజర్ నారాయణ, అతని తిక్కల్ ఫ్యామిలీ పరిచయం చేస్తుంది. నారాయణ ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తి .అతని భార్య ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతుంది. అతని పెద్ద కొడుకు బెట్టింగ్‌పై ఆసక్తి చూపుతుండగా, అతని చిన్న కొడుకు ఫోటోగ్రాఫర్ కావాలనుకుంటున్నాడు. ఒక యువకుడు, ఒక స్థానిక డాన్ ..రాజకీయ నాయకుడు కావాలని అనుకుంటారు. కొందరు బక్రాల కోసం వెదుకుతుండగా నారాయణ కుటుంబాన్ని ట్రాప్ చేస్తారు, ఇది కామెడీ అఫ్ ఎర్రర్ ని జనరేట్ చేస్తుంది.
చిన్న పాపిశెట్టి కామెడీని చాలా సమర్ధవంతంగా హ్యాండిల్ చేశారు. టీజర్ ఆహ్లాదకరమైన ప్రయాణాన్ని ఇస్తుంది. సుధాకర్ కామిక్ టైమింగ్ చాలా బాగుంది. చివరి సీక్వెన్స్ హిలేరియస్ గా ఉంది. దేవి ప్రసాద్, ఆమని, పూజా కిరణ్, జై కృష్ణ తమ తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు.
శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ సినిమాలో నటించిన వారంతా పెద్ద పొజిషన్ లో వున్నారు. సుధాకర్ కూడా ప్రయత్నిస్తున్నాడు. తనకు ప్రతిభ, డ్యాన్స్, లుక్స్ , యాక్టింగ్ అన్నీ వున్నాయి. చాలా కష్టపడతాడు. ఈ సినిమాతో తను కోరుకునే స్థాయికి వెళ్తాడని భావిస్తున్నాను. టీజర్ చాలా ఫన్ గా వుంది. ఇలాంటి జానర్ సినిమాలని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఓ రెండు గంటలు మనల్ని మనం మర్చిపోయి చూసే సినిమాలివి. అలాంటి ఫ్లావర్, ఎనర్జీ కనిపిస్తుంది. దర్శకుడు చిన్నా చాలా చక్కగా తీశారు. యంగ్ టీం పని చేస్తోంది. ఆమని గారు లాంటి సినియర్ కూడా వున్నారు. సినిమా చాలా కొత్తగా కనిపిస్తోంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా ఘన విజయం సాధించాలి అని కోరారు.
సుధాకర్ కోమాకుల మాట్లాడుతూ, శేఖర్ కమ్ముల గారికి కృతజ్ఞతలు. చాలా బిజీలో ఉన్నప్పటికీ మా కోసం వచ్చారు. ఇది జీవితంలో మర్చిపోలేని విషయం. నారాయణ & కో లో ఒక నిర్మాతగా కూడా వున్నాను. దీనికి కారణం ఎప్పటి నుంచో మంచి కంటెంట్ క్రియేట్ చేయాలనే ఆలోచన వుండేది. దర్శకుడు చిన్న చాలా మంచి కథతో వచ్చారు. నారాయణ & కో .. కోట్లాది మందికి రీచ్ అవుతుంది. ఫ్యామిలీ అంతా కలసి చూడాల్సిన సినిమా. క్రైమ్ కామెడీ. మిడిల్ క్లాస్, క్రైమ్ కామెడీ క్రేజీ కాంబినేషన్. అందుకే తిక్కల్ ఫ్యామిలీ అన్నాన్. దేవి ప్రసాద్, ఆమనీ గారితో పాటు మిగతా వారంతా కూడా అద్భుతంగా నటించారు అన్నారు
ఆమని మాట్లాడుతూ.. నారాయణ & కో లో డ్రీం రోల్ చేశాను. ఎప్పటి నుంచో ఇలాంటి పాత్ర చేయాలని వుంది. ఒక ఆర్టిస్ట్ గా తృప్తిని ఇచ్చిన పాత్రని ఇచ్చిన దర్శకుడు చిన్నా గారికి కృతజ్ఞతలు. ఈ సినిమా కోసం టీం అంతా ఎంతో కష్టపడి పని చేసింది. దేవి ప్రసాద్ గారు కూడా కీలక పాత్ర చేశారు. సుధాకర్ తన ప్రతిభ అంతా ఈ సినిమాలో కనిపిస్తుంది. సినిమా చాలా బాగా వచ్చింది. మీ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను.
చిన్నా పాపిశెట్టి మాట్లడుతూ.. నారాయణ & కో లో క్లీన్ కామెడీ వుంటుంది. ఫ్యామిలీ అంతా కలసి చూసే సినిమా ఇది. సుధాకర్ గారు వచ్చిన తర్వాత నిర్మాణ భారం సగం తగ్గిపోయింది. షూటింగ్ ని చాలా ఎంజాయ్ చేశాం. టీ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఈవెంట్లో సినిమా యూనిట్ అంతా పాల్గొన్నారు.
సురేష్ బొబ్బిలి, డా. జోస్యభట్ల, నాగ వంశీ త్రయం సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ శ్రీవాత్సవ్ సినిమాటోగ్రఫీ, సిద్దం మనోహర్ అడిషినల్ సినిమాటోగ్రఫీ అందించారు. కమ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. రవితేజ జి ఈ చిత్రానికి కథను అందించగా, రాజీవ్ కె డైలాగ్ రైటర్. సృజన అడుసుమిల్లి ఎడిటర్. శ్రీనివాస్ గొర్రిపూడి సహ నిర్మాత, రవి దొండపాటి ఆర్ట్ డైరెక్టర్. రెడ్ సెడార్ ఎంటర్‌టైన్‌మెంట్ , శరద్ గుమాస్టే అసోసియేట్ ప్రొడ్యూసర్.