Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మణికంఠ తీసిన కొత్తపెళ్లికూతురు షార్ట్ ఫిలిం చాలా ఇష్టం : మెహర్ రమేష్

Advertiesment
Meher Ramesh, Sai Charan, Ushasri, Manikantha

దేవి

, శనివారం, 6 డిశెంబరు 2025 (16:53 IST)
Meher Ramesh, Sai Charan, Ushasri, Manikantha
సాయి చరణ్, ఉషశ్రీ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న చిత్రం 'ఇట్స్ ఓకే గురు'. మణికంఠ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని క్రాంతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా డిసెంబర్ 12 రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
 
డైరెక్టర్ మెహర్ రమేష్ మాట్లాడుతూ.. నేను ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాకి పూరి జగన్నాథ్ గారి దగ్గర అసిస్టెంట్ గా పని చేశాను. బడ్జెట్ తో సంబంధం లేకుండా సబ్జెక్ట్ ని నమ్మి చేసిన సినిమా అది. ఆ సినిమా తర్వాత రవితేజ, పూరి జగన్నాథ్ గారు మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈ సినిమా చూస్తుంటే నాకు మంచి సబ్జెక్టు ఉన్నట్టు అనిపిస్తుంది. డైరెక్టర్ మణికంఠ, టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. చిన్న సినిమాల్లో చాలా అద్భుతంగా ఆడుతున్నాయి. ఈ సినిమా కూడా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఇందులో ఒక సాంగ్ నాకు చాలా నచ్చింది. మణికంఠ తీసిన కొత్తపెళ్లికూతురు షార్ట్ ఫిలిం నాకు చాలా ఇష్టం. ఈ సినిమాని కూడా చాలా కష్టపడి మంచి సబ్జెక్టు రాసుకొని తీసాడు. మేము కలిసి త్వరలోనే ఒక వెబ్ సిరీస్ కూడా చేయాలని ఉంది. ఈ సినిమా హీరో చరణ్ లో చాలా మంచి ఈజ్ ఉంది. తన పర్ఫామెన్స్ నాకు చాలా నచ్చింది. మణికంఠ తన కాంబినేషన్లో మరో సినిమా రావాలని కోరుకుంటున్నాను.  
 
దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. 'ఇట్స్ ఓకే గురు' టైటిల్ చాలా బాగుంది. అందరికీ రీచ్ అయింది. కంటెంట్ చూస్తుంటే లవ్ స్టోరీలా అనిపిస్తుంది. విజువల్స్ మ్యూజిక్ అన్ని బాగున్నాయి. లవ్ స్టోరీ కి మ్యూజిక్ విజువల్స్ బాగుంటే 60% సినిమా హిట్ అయినట్టే. సినిమాని మంచిగా ప్రమోట్ చేసి జనాల్లోకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. హీరో చరణ్ హీరో ఈజ్ బాగుంది. హీరోయిన్ జయసుధ గారు లాగా అనిపించారు. ఈ ఇద్దరికీ మంచి కెరీర్ ఉండాలని కోరుకుంటున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ 
 
 డైరెక్టర్ మణికంఠ మాట్లాడుతూ, ఇట్స్ ఓకే గురు అనేది ఒక మంత్ర. ఎన్ని సమస్యలు వచ్చినా ఇట్స్ ఓకే అని ముందుకెళ్ళిపోతే లైఫ్ చాలా ఆనందంగా ఉంటుంది. అదే ఈ సినిమాలో ఉంది. మన మనసుతో మనం వైవా చేసుకుంటే ఎలా ఉంటుందో అదే మా సినిమా. అందరూ థియేటర్స్ కి వచ్చి సినిమా చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. తప్పకుండా ఈ సినిమా మీ అందరిని అలరిస్తుంది 
 
ప్రొడ్యూసర్ క్రాంతి ప్రసాద్ మాట్లాడుతూ, మన దైనందిన జీవితంలో చిన్న విషయాలకు కూడా డిప్రెషన్ లోకి వెళ్లిపోతుంటాము. చిన్న చిన్న వాటికి కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. ఈ సినిమాలో ఎమోషన్స్ ని ఎలా అధిగమించాలి అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు ఈ సినిమా చూస్తే డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేస్తారు. మంచి లవ్ స్టోరీ పాటు అన్ని ఎమోషన్స్ ఇందులో ఉన్నాయి. కచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది 
 
హీరో సాయి చరణ్ మాట్లాడుతూ, మా అమ్మ ఎన్ని కష్టాలు వచ్చినా పర్వాలేదు ఇట్స్ ఓకే ప్రయత్నించమని చెప్పింది. ఆ మాట నాలో ఎంతో ఎనర్జీని నింపింది. అక్కడి నుంచి ప్రతిక్షణం మళ్లీ కొత్తగా ప్రయత్నిస్తూనే ఉన్నాను. అలాంటి సమయంలో ఈ సినిమా ఈ సినిమా వచ్చింది. టైటిల్ ఇట్స్ ఓకే గురు అని చెప్పారు. అది నాకు చాలా పర్సనల్ కనెక్షన్ అనిపించింది. డిసెంబర్ 19న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. తప్పకుండా ఈ సినిమా అందరికి కూడా పర్సనల్గా కనెక్ట్ అవుతుంది.  
 
హీరోయిన్ ఉషశ్రీ మాట్లాడుతూ, నాకు చైల్డ్ ఆర్టిస్ట్ గా అవకాశం ఇచ్చిన డైరెక్టర్ ఈరోజు మెయిన్ లీడ్ గా నేను చేస్తున్న సినిమాకి గెస్ట్ గా రావడం చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ డైరెక్టర్ కి థాంక్యూ. ఈ సినిమా నాకు చాలా స్పెషల్. హీరోయిన్ గా మీ ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది మా టీమ్ అందరికీ థాంక్యూ. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర ల పోలీస్ కంప్లెయింట్