Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాద్ కల్చరే దరిద్రం. అందుకే డ్రగ్స్ మచ్చ.. కానీ చెన్నయ్ ఎంతో బెస్ట్ అంటున్న సినీ నిర్మాత

తెలుగుచిత్ర పరిశ్రమ ఖర్మగాలి డ్రగ్స్ రాకెట్‌లో చిక్కుకుని పోలీసు విచారణలో ఇరుక్కోవడానికి హైదరాబాద్ నగర సంస్కృతే కారణమని సినీ నిర్మాత ఫిలిం చాంబర్ అధ్యక్షుడు సి.కల్యాణ్ ఆరోపించారు. తెలుగు సినీ ప్రముఖులను వరుసబెట్టి తెలంగాణ ఎక్సైజ్ శాఖ బీభత్సంగా విచార

Advertiesment
హైదరాబాద్ కల్చరే దరిద్రం. అందుకే డ్రగ్స్ మచ్చ.. కానీ చెన్నయ్ ఎంతో బెస్ట్ అంటున్న సినీ నిర్మాత
హైదరాబాద్ , సోమవారం, 24 జులై 2017 (03:47 IST)
తెలుగుచిత్ర పరిశ్రమ ఖర్మగాలి డ్రగ్స్ రాకెట్‌లో చిక్కుకుని పోలీసు విచారణలో ఇరుక్కోవడానికి హైదరాబాద్ నగర సంస్కృతే కారణమని సినీ నిర్మాత ఫిలిం చాంబర్ అధ్యక్షుడు సి.కల్యాణ్ ఆరోపించారు. తెలుగు సినీ ప్రముఖులను వరుసబెట్టి తెలంగాణ ఎక్సైజ్ శాఖ  బీభత్సంగా విచారణ చేస్తున్న నేపథ్యంలో తెలుగు చిత్రపరిశ్రమ పరువు పోయిందని, ఇకనైనా టాలీవుడ్ మేల్కొనాలని కల్యాణ్ పిలుపునిచ్చారు.  చెన్నయ్ వాతావరణం గుడిలో భక్తిపాటలు, పక్కనే కాఫీ షాపుల్లో నురగలు గక్కే కాఫీతో జనాలను ఆహ్లాదపరిస్తే, హైదరాబాద్‌లో అలాంటి దృశ్యమే తెల్లవారుజామున కనిపించదని కల్యాణ్ సంచనల ఆరోపణలు చేశారు. పైగా తల్లిదండ్రులు పిల్లలను గాలికి వదిలేశారని  వాళ్ల విచ్చలవిడితనానికి, డ్రగ్స్ వాడకానికి తల్లి దండ్రే కారణమని కల్యాణ్ దుయ్యబట్టారు. తల్లిదండ్రల కష్టాన్ని చూసి కాకుండా వాళ్ల సంపాదనను చూస్తూ పెరుగుతున్న పిల్లలకే డ్రగ్స్ వంటి వివరీతమైన కోరికలు, వాంఛలు పుట్టుకొస్తున్నాయని, మన మధ్యతరగతి ఇంకా ఈ ఊబిలో చిక్కుకోకుండా ఉండటానికి వారు తమ తల్లి తండ్రుల కష్టాన్ని చూస్తూ  పెరగడమేనని కల్యాణ్ స్పష్టం చేశారు. ఆలోచింపజేస్తున్న సి.కల్యాణ్ చెదువాస్తవాలు ఆయన మాటల్లోనే...
 
చెన్నైలో డ్రగ్స్ అనే మాటలే రావు! తెల్లవారుజామున నాలుగు గంటలకు రోడ్డు మీద వెళ్తుంటే గుడిలో భక్తి పాటలు, పక్కనే కాఫీ షాపుల్లో నురగలు కక్కుతూ కాఫీ.. వేడి ఇడ్లీ... ఆ టైమ్‌లో అక్కడ ఆగి కాఫీ తాగాలని అనిపించే వాతావరణం చెన్నైలో కనిపిస్తుంది. అలాంటిది మీకు హైదరాబాద్‌లో ఎప్పుడైనా కనిపించిందా ఎక్కడి సంప్రదాయాలు అక్కడివి. మనం దేన్నీ పోల్చకూడదు.
 
హైదరాబాద్‌కు డ్రగ్స్‌ ఎలా వచ్చాయంటే డబ్బు  తెస్తున్న కిక్‌! తల్లిదండ్రులకు డబ్బు ఎక్కువైపోయి, పిల్లలు డ్రగ్స్‌ తీసుకుంటున్నారు. ఓ ఫ్రెండ్‌ నన్ను హైదరాబాద్‌లో ఓ సారి రెస్టారెంట్‌కి పిలిస్తే వెళ్లా. అక్కడ డార్క్‌ రూమ్‌లో అమ్మాయిలు, అబ్బాయిలు తేడా లేకుండా హుక్కా తాగుతున్నారు. ఓ.. కేకలు. తలుపు తీసి చూస్తే భయమేసింది. దాదాపు రోజంతా దడ పోలేదు. పిల్లల్ని గురించి ఎన్నో కలలు కంటాం. కానీ వాళ్లు ఇలాంటి వాటికి అలవాటు పడితే, మన జీవన పోరాటం ఏమైనట్టు! మధ్యతరగతి పిల్లలు అంత తేలిగ్గా తప్పుడు మార్గాలు పట్టకపోవడానికి కారణం... వాళ్లు తమ తల్లిదండ్రుల కష్టాన్ని చూస్తూ పెరగడమే. డబ్బున్న చోట కష్టం విలువ తెలియదు.
 
ముంబై ఆర్టిస్టులు రావడం వల్ల.. డ్రగ్స్‌ లాంటివి హైదరాబాద్‌లో పెచ్చుమీరాయని ఆరోపించడం తప్పు. ఎంత మంది వచ్చారు ముంబై నుంచి అయినా వచ్చిన వాళ్లు. ఎంతమంది ఇక్కడ లీడ్‌ చేస్తున్నారని! అవన్నీ వట్టి మాటలు! కాకపోతే మనందరం ఒప్పుకోవాల్సిన నిజం ఏంటంటే మన కల్చర్‌ మారింది. సంపాదన పెరిగింది. వాట్సాప్ లు, ఫేస్‌బుక్‌లు వచ్చాయి. వాటివల్ల అలా ఉండాలి, ఇలా ఉండాలని.. యూత్‌కి కోరికలు పుడుతున్నాయి. తప్పులు ఎక్కువవుతున్నాయి.
 
డ్రగ్స్‌ వ్యవహారంలో బడా నిర్మాతల పిల్లలూ ఉన్నారనే అరోపణలు వస్తున్నాయి కదా.. ఇండస్ట్రీలో ఉన్నవాళ్ల పిల్లల పేర్లే అయి ఉండి, ఇప్పటిదాకా బయటికి రాకపోయినట్లయితే భగవంతుడు వారిని రక్షించినట్టు, ఇంకా ఇండస్ట్రీ పేరు డ్యామేజ్‌ కాకుండా కాపాడినట్టు అనుకోవాలి. కానీ తల్లిదండ్రులు ఇక మీదయినా జాగ్రత్తగా చూసుకుని, పరిశ్రమ పరువు కాపాడాలి.
 
ఇకపై సినిమా ప్రారంభం కావడానికి ముందు ‘డ్రగ్స్‌ వాడడం హానికరం. డ్రగ్స్‌ వాడొద్దు, బానిస కావద్దు. ఒకసారి బానిసైతే దానిలో నుంచి బయటికి రాలేం’ అని చెప్పబోతున్నాం. ప్రభుత్వం అనుమతించిన పొగాకునే వాడొద్దని చెబుతున్నాం కదా! డ్రగ్స్‌ మీద స్మాల్‌ ఫిలిమ్స్‌ చేసే వాళ్లుంటే నేను డబ్బు ఖర్చుపెట్టి తీస్తా!
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్ బాస్ కళ తప్పింది... జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ కనిపించాడు షో పుల్ జోష్