Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 7 April 2025
webdunia

మాటకు ముందు సిగ్గుపడతా.. సినిమాల్లోకి ఎలా వచ్చానో అర్థం కాలేదు.. ప్రభాస్

జీవితంలో నేను నటించగలనని ఎప్పడూ అనుకోలేదు.. ఎందుకంటే నాకు విపరీతమైన మొహమాటం, సిగ్గూనూ. పది మంది ముందు మాట్లాడటానికి కూడా బిడియమే. కానీ 18 ఏళ్ల వయస్సులో నటుడిని కావాలనే ఆలోచన వచ్చింది. నటించాలని ఉందంటూ

Advertiesment
Prabhas
హైదరాబాద్ , గురువారం, 25 మే 2017 (01:29 IST)
జీవితంలో నేను నటించగలనని ఎప్పడూ అనుకోలేదు.. ఎందుకంటే నాకు విపరీతమైన మొహమాటం, సిగ్గూనూ. పది మంది ముందు మాట్లాడటానికి కూడా బిడియమే. కానీ 18 ఏళ్ల వయస్సులో నటుడిని కావాలనే ఆలోచన వచ్చింది. నటించాలని ఉందంటూ మా నాన్న, పెదనాన్నకు చెబితే వాళ్లు సంతోషించారు తర్వాత సినిమానే కెరీర్‌ అయిపోయింది అంటూ ప్రభాస్ తన మనసులో మాట విప్పి చెప్పుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న బాహుబలి-2 సినిమా విడుదలైన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ తన సినీ కెరీర్ గురించి, బాహుబలి వరకు తన పయనం గురించి పంచుకున్నారు. 
 
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ. 1500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన బాహుబలి-2 చిత్రం వల్ల ప్రాంతీయ చిత్ర నిర్మాతల్లో భారీగా అశలు చిగురించాయని ప్రభాస్ ఈ ఇంటర్వ్యూలో చెప్పారు. మేము ‘బాహుబలి’ మొదలుపెట్టినప్పుడు.. రాజమౌళి తన మదిలో ఎలా వూహించుకుంటున్నారో అలానే నటించడంపైనే దృష్టి పెట్టా. ఓ నటుడిగా ‘బాహుబలి’ని ప్రేక్షకులకు అందించాలని అనుకున్నా. కానీ ఈ చిత్రం ఇంత భారీ విజయం సాధిస్తుందని కలలో కూడా వూహించలేదు. ‘బాహుబలి’ ప్రాంతీయ చిత్ర నిర్మాతల ఆశలను పెంచింది. ప్రేక్షకుల హృదయాల్లో ‘బాహుబలి’ స్థానం సంపాదించుకుంది. పాత్రలో నిలకడ ప్రదర్శిస్తూ తండ్రి-కుమారుడిగా నటించడం పెద్ద పనే. తండ్రీకొడుకుల మధ్య సెంటిమెంట్స్‌ను అర్థం చేసుకుని రెండు విధాలుగా నటించడం అంత తేలిక కాదు’ అన్నారు.
 
‘రాజమౌళిపై నాకు చాలా గట్టి నమ్మకం, గౌరవం ఉంది. ‘బాహుబలి’గా నేను నటించగలనని ఆయన నమ్మడమే నా దృష్టిలో చాలా పెద్ద విషయం. ‘బాహుబలి’ కోసం అవసరమైతే ఏడేళ్లు పనిచేయడానికైనా నేను సిద్ధం. ఓ నటుడి జీవితంలో అలాంటి పాత్రల్లో నటించే అవకాశం ఒక్కసారే వస్తుంది. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతుడిని’ అని ప్రభాస్‌ హిందూస్థాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ జబ్బుతో ఇబ్బంది పడ్డానంటున్న స్నేహా ఉల్లాల్...