Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 6 April 2025
webdunia

వేడి నీటితో బోలెడు ప్రయోజనాలు.. ఒళ్లు నొప్పులున్నట్లు అనిపిస్తే.. వేడినీళ్లు తీసుకోండి..

వేడి నీళ్లకు కాస్త తేనె, నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. వేడినీళ్లు మీ శరీరంలోని చెడువ్యర్థాలని తొలగిస్తాయి. రాత్రిపూట ఆహారంతోపాటూ గోరువెచ్చని నీళ్లను తీసుకోవడం మంచిది. మ

Advertiesment
Hot water health benefits
, శనివారం, 3 సెప్టెంబరు 2016 (10:45 IST)
వేడి నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాల్ని సొంతం చేసుకోవచ్చు. బరువు తగ్గాలనుకునేవారికి ఇవెంతో మేలుచేస్తాయి. వేడినీళ్లు తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత కొద్దిగా పెరుగుతుంది. దాంతో జీవక్రియారేటూ ఇనుమడిస్తుంది. వేడి నీళ్లూ అధిక ఆకలిని అదుపులో ఉంచుతాయి. ఇవన్నీ బరువుని అదుపులో ఉంచేందుకు ఉపయోగపడతాయి.
 
* జలుబు, దగ్గు వంటి సమస్యలకు పరిష్కారంగానూ వేడినీటిని తీసుకోవచ్చు. శ్వాసకోశ ఇబ్బందుల నుంచి ఉపశమనం ఉంటుంది. ఒళ్లు నొప్పులుగా అనిపించినప్పుడు వేడినీళ్లు తీసుకుంటే రక్తప్రసరణ సక్రమంగా జరిగి ఉపశమనం లభిస్తుంది.
 
* వేడి నీళ్లకు కాస్త తేనె, నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. వేడినీళ్లు మీ శరీరంలోని చెడువ్యర్థాలని తొలగిస్తాయి. రాత్రిపూట ఆహారంతోపాటూ గోరువెచ్చని నీళ్లను తీసుకోవడం మంచిది. మసాలా పదార్థాలు ఎక్కువగా తీసుకున్నప్పుడు గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగితే చక్కగా జీర్ణమవుతుంది. మలబద్ధకం అదుపులోకి వస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మజ్నుకు సూపర్ రెస్పాన్స్.. క్లైమాక్స్‌లో రాజ్ తరుణ్ రోలే సినిమాకు హైలైట్