Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆర్‌.మాధ‌వ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో జీ5 రూపొందించిన చిత్రం హిసాబ్ బరాబర్

Advertiesment
Hisab Barabar- Madhavan

డీవీ

, శనివారం, 11 జనవరి 2025 (16:31 IST)
Hisab Barabar- Madhavan
ప్ర‌ముఖ ఓటీటీ జీ5 నుంచి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన సినిమా రానుంది. అదే ‘హిసాబ్ బరాబర్’. విల‌క్ష‌ణ న‌టుడు ఆర్‌.మాధ‌వ‌న్ ఇందులో ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించగా నీల్ నితిన్‌, కీర్తి కుల్హారి ఇత‌ర పాత్ర‌ల్లో మెప్పించ‌నున్నారు. జీ5లో జ‌న‌వ‌రి 24 నుంచి తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ప్రీమియ‌ర్‌కు సిద్ధ‌మైందీ చిత్రం. ఈ సినిమా ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. 
 
ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే.. ఓ బ్యాంక్ చేసే చిన్న పొర‌పాటు ఓ వ్య‌క్తి జీవితాన్ని త‌ల‌క్రిందులు చేస్తే ..అత‌నెలా స్పందించాడు. న్యాయం కోసం అత‌ను ఎలాంటి పోరాటం చేశాడ‌నే క‌థాంశంతో ఈ సినిమా తెర‌కెక్కింది. ఆర్థిక‌ప‌ర‌మైన మోసం, అవినీతి, న్యాయం కోసం చేసే పోరాటం ఇవ‌న్నీక‌థ‌లో భాగంగా మిళిత‌మై ఎంతో ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. విల‌క్ష‌ణ న‌టుడు ఆర్‌.మాధ‌వ‌న్, నీల్ నితిన్‌,కీర్తి కుల్హారి త‌దిత‌రులు వారి న‌ట‌న‌తో పాత్ర‌ల‌కు ప్రాణం పోశారు. ప్రేక్ష‌కులు మెచ్చేలా చ‌క్క‌టి డ్రామా, కామెడీ, సామాజిక అంశాల‌తో.. అశ్విన్ ధీర్ ద‌ర్శ‌క‌త్వంలో జియో స్టూడియోస్, ఎస్‎పి సినీకార్ప్ ఈ చిత్రాన్ని నిర్మించాయి.
 
 
 రైల్వే డిపార్ట్‌మెంట్‌లో చిరు ఉద్యోగి అయిన రాధే మోహ‌న్ శ‌ర్మ పాత్ర‌లో మాధ‌వ‌న్ మ‌న‌కు ఇందులో క‌నిపిస్తారు. ఆయ‌న ఓసారి త‌న బ్యాంక్ ఖాతాలో చిన్న తేడాని గుర్తించి బ్యాంకు అధికారుల‌ను ప్ర‌శ్నిస్తాడు. దాని గురించి ఆరా తీయ‌గా అదొక పెద్ద ఆర్థిక‌మైన మోస‌మ‌ని తెలుస్తుంది. దాని చుట్టు ఉన్న మోసం, అవినీతి వంటి వాటిని స‌ద‌రు టికెట్ క‌లెక్ట‌ర్ గుర్తిస్తాడు. ఈ క్ర‌మంలో త‌ను ఆ బ్యాంక్ హెడ్ మిక్కీ మెహ‌తా (నీల్ నితిన్‌) వంటి పెద్ద వ్య‌క్తితో పోరాటం చేయాల్సి వ‌స్తుంది. ఊహించ‌ని మ‌లుపుల‌తో సాగే ఈ క‌థ‌లో రాధే మోహ‌న్ అనే సామాన్యుడు అవినీతితో వ్య‌వ‌స్థీకృత‌మైన స‌మ‌స్య నుంచి ఎలా ఎదుర్కొంటాడు.. దాన్నుంచి సుర‌క్షితంగా ఎలా బ‌య‌ట ప‌డ‌తాడు? అనే విష‌యాలు అంద‌రినీ ఆలోచింప చేస్తాయి. 
 
ద‌ర్శ‌కుడు అశ్విన్ ధీర్ మాట్లాడుతూ ‘‘ స‌మాజంలోని అవినీతి, మోసాల‌ను ఓ సామాన్యుడు ఎలా ఎదుర్కొన్నాడ‌నే క‌థాంశంతో రూపొందిన‌‘హిసాబ్ బ‌రాబ‌ర్‌’ అంద‌రిలో ఆలోచింప చేసే చిత్రం. సామాజిక అంశాల‌తో పాటు ప్రేక్ష‌కుల‌కు కావాల్సిన డ్రామా, కామెడీ, ఎమోష‌న్స్ అన్నీ ఉంటాయి. మాధ‌వ‌న్‌, నీల్ నితిన్‌, కీర్తి కుల్హారి వంటి వారు త‌మ‌దైన న‌ట‌న‌తో మెప్పిస్తారు. జనవరి 24న సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది’’ అన్నారు. 
 
ఆర్‌.మాధ‌వ‌న్ మాట్లాడుతూ ‘‘జీ5తో నేను చేసిన తొలి సినిమా ఇది. ఇలాంటి ఓ సినిమాలో భాగం కావ‌టం అనేది యాక్ట‌ర్‌గా నాకెంతో సంతోషంగా ఉంది. సామాన్యుడైన రాధే మోహ‌న్ శ‌ర్మ పాత్ర‌లో న‌టించ‌టాన్ని ఎంజాయ్ చేశాను. ఈ పాత్ర నాకు ఛాలెంజింగ్‌గా అనిపించింది. మ‌నలో ఉండే కామ‌న్ మ్యాన్ అవినీతికి వ్య‌తిరేకంగా ఎలా పోరాటం చేశాడ‌నేదే క‌థ‌. అంద‌రికీ మూవీ న‌చ్చుతుంది. ఇలాంటి వాస్త‌వ క‌థ‌నాల‌తో సినిమాలు మ‌రిన్ని రావాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు. 
 
నీల్ నితిన్ మాట్లాడుతూ ‘‘హిసాబ్ బరాబర్ చిత్రంలో మిక్కీ మెహతా అనే బ్యాంకర్ పాత్రతో మెప్పిస్తాను. యాక్టర్‌గా నాకు స‌వాలు విసిరిన పాత్ర ఇది. మాధ‌వ‌న్ వంటి యాక్ట‌ర్‌తో క‌లిసి న‌టించ‌టం చాలా సంతోషం. త‌నొక అద్భుమైన న‌టుడు, వ్య‌క్తి. స్క్రీన్‌పై మా ఇద్ద‌రి మ‌ధ్య పోటాపోటీగా ఉండే స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తాయి. జ‌న‌వ‌రి 24 నుంచి జీ5లో ఈ సినిమా ప్రీమియ‌ర్ కానుంది’’ అన్నారు. 
 
కీర్తి కుల్హారి మాట్లాడుతూ ‘‘హిసాబ్ బరాబర్ వంటి చిత్రంలో నటిగా సవాలు విసిరిన వైవిధ్యమైన పాత్రలో నటించటం ఎంతో సంతోషంగా ఉంది. మాధ‌వ‌న్‌గారితో న‌టించ‌టం మంచి ఎక్స్‌పీరియె్స్‌. అశ్విన్ ధీర్ సినిమాను ఎంతో గ్రిప్పింగ్‌గా తెర‌కెక్కించారు. అన్నీ అంశాల‌ను మేళ‌వించి తెర‌కెక్కించిన ఎంటైర్‌టైన‌ర్ ఇది. అంద‌రినీ ఆలోచింప చేసే చిత్రం. జ‌న‌వ‌రి 24 నుంచి ప్రీమియ‌ర్ కానున్న ఈ సినిమాను ఆద‌రించాల‌ని కోరుకంటున్నాను’’ అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Samantha: చికెన్ గున్యా నుంచి కోలుకుంటున్న సమంత - వీడియో వైరల్