Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అన్నీ ఉన్నా చాన్సులు లేక సైడ్ అయిపోయిన బాపు బొమ్మ.. నిర్మాతగా సెకెండ్ ఇన్నింగ్స్

అత్తారింటికి దారేది చిత్రంలో సెకెండ్ హీరోయిన్‌గా నటిస్తేనేమి.. బాపుగారి బొమ్మ పాట ద్వారా కోట్లమంది తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ప్రణీతకు దురదృష్టం వెన్నాడుతున్నట్లుంది. పేరుకు కన్నడం, తమిళం, తెలుగు భాషల్లో నటిస్తూ బహుభాషా నటి అనిపించుకుంట

అన్నీ ఉన్నా చాన్సులు లేక సైడ్ అయిపోయిన బాపు బొమ్మ.. నిర్మాతగా సెకెండ్ ఇన్నింగ్స్
హైదరాబాద్ , బుధవారం, 17 మే 2017 (08:46 IST)
అత్తారింటికి దారేది చిత్రంలో సెకెండ్ హీరోయిన్‌గా నటిస్తేనేమి.. బాపుగారి బొమ్మ పాట ద్వారా కోట్లమంది తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ప్రణీతకు దురదృష్టం వెన్నాడుతున్నట్లుంది. పేరుకు కన్నడం, తమిళం, తెలుగు భాషల్లో నటిస్తూ బహుభాషా నటి అనిపించుకుంటున్నా మంచి అవకాశాలను పొందడంలో వెనుకబడి పోయింది. చివరికి ఇలా కాదని ఏకకాలంలో అటు నిర్మాతగానూ, ఇటు రెస్టారెంట్ బిజినెస్‌తోనూ కొత్త అవతారానికి ప్రణీత సిద్ధమవుతోంది. 
 
కన్నడ యువతులకు సహజసిద్ధమైన చక్కని శరీరాకృతి, ఆకర్షణీమైన అందం వంటి ప్లస్‌ పాయింట్స్‌ ఉన్నా పాపం ఎందుకో రెండో హీరోయిన్‌ పాత్రలకే పరిమితం అవుతోంది ప్రణీత. తమిళంలో కార్తీ వంటి స్టార్‌ హీరోతో శకుని చిత్రంలో నటించినా ఆ చిత్రం నిరాశనే మిగిల్చింది. ఆ తరువాత కూడా కోలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు రాలేదు.
 
తర్వాత తెలుగు చిత్రపరిశ్రమలో అడుగిడినా అత్తారింటికి దారేది లాంటి భారీ చిత్రంలో సెకెండ్‌ హీరోయిన్‌ పాత్రతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది. నటిగా అవకాశాలను నమ్ముకుంటే లాభం లేదనుకుందో ఏమో ఇటీవల బెంగుళూర్‌లో ఒక రెస్టారెంట్‌ను ప్రారంభించి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది.
 
తాజాగా ప్రణీతకు నిర్మాతగా మారాలనే కోరిక పుట్టిందట. త్వరలోనే చిత్రం నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. దీని గురించి ప్రణీత తెలుపుతూ నిర్మాతగా మారాలని నిర్ణయించుకున్న విషయం నిజమేనంది. ఇతర కథానాయికల కంటే భిన్నంగా ఉండాలని ఆశిస్తున్నట్లు పేర్కొంది. అయితే ఈ భామ ఏ భాషలో చిత్రాన్ని నిర్మించేది క్లారిటీ ఇవ్వకపోవడం గమనార్హం.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాహుబలి-2 స్ఫూర్తితో అత్యంత భారీ చిత్రం 'కురుక్షేత్ర'కు సై అంటున్న కన్నడ నాడు