Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'గబ్బర్ సింగ్' హిట్ అయిందా? అని పవన్ అడిగారు.. ఔనంటే మౌనంగా ఉండమన్నారు: హరీష్ శంకర్

తాను దర్శకత్వం వహించిన గబ్బర్ సింగ్ హిట్టయిందా అని ఆ చిత్ర హీరో పవన్ కళ్యాణ్ అడిగితే తాను ఔనని చెపితే.. మౌనంగా ఉండమని సలహా ఇచ్చారని టాలీవుడ్ దర్శకుడు హరీష్ శంకర్ చెప్పుకొచ్చారు. ఈ మాట ఇపుడు ఎందుకు చెప

Advertiesment
'గబ్బర్ సింగ్' హిట్ అయిందా? అని పవన్ అడిగారు.. ఔనంటే మౌనంగా ఉండమన్నారు: హరీష్ శంకర్
, సోమవారం, 12 జూన్ 2017 (12:57 IST)
తాను దర్శకత్వం వహించిన గబ్బర్ సింగ్ హిట్టయిందా అని ఆ చిత్ర హీరో పవన్ కళ్యాణ్ అడిగితే తాను ఔనని చెపితే.. మౌనంగా ఉండమని సలహా ఇచ్చారని టాలీవుడ్ దర్శకుడు హరీష్ శంకర్ చెప్పుకొచ్చారు. ఈ మాట ఇపుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందో కూడా ఆయన వివరించారు. 
 
"గబ్బర్ సింగ్' సినిమా విజయం తర్వాత ఆ విజయాన్ని ఆయనతోనే ఆస్వాదించాలని, ఒక్క ఇంటర్వ్యూ ఇప్పించాలని తీవ్రంగా ప్రయత్నిస్తే ఆయన... 'విజయం అన్నది మనిషి ఎప్పుడూ చేయని పనులన్నీ చేయిస్తుంది... అవసరం లేని మనుషులతో, అవసరం లేని మాటలు మాటాడిస్తుందని, వాటిని నివారించాలంటే విజయం తర్వాత సాధారణంగా ఉండాల'ని పవన్ సూచించారని హరీష్ చెప్పారు. 
 
అప్పటికీ ఎంతో బ్రతిమిలాడటంతో 'సినిమా హిట్టైందా?' అని ఆయన అడిగితే తాను 'అవును సార్... సినిమా సూపర్ హిట్' అని చెప్పాను. దానికి ఆయన 'మరి మనం మాట్లాడాల్సిన అవసరం ఏముంది?' అంటూ మౌనంగా ఉండమన్నారు" అని గుర్తుచేశాడు. ఒకసారి పవన్ కల్యాణ్ ఫ్యాన్ అయితే.. ఇక కట్టె కాలేవరకు పవన్ కళ్యాణ్ ఫ్యానేనని చెప్పాడు.
 
అంతేకాకుండా, 'తెలుగు సినిమాల్లో సాహిత్యం చచ్చిపోతోంది, చచ్చిపోతోందని అని అంతా ఆరోపిస్తుంటారు. మంచి సాహిత్యంతో పాటలు రాస్తే... దానిలో కూడా వివాదాలు రేపితే ఎలా?' అని హరీష్ శంకర్ ప్రశ్నించారు. ఒకవేళ అలాంటి వివాదంలో ఏవైనా తిట్టాలనుకుంటే ఆ తిట్లు దర్శకుడైన తనకివ్వాలని... రచయితను పీడించి, పాటలు రాయించేది తానేనని, పాట బాగుంటే కనుక ఆ పాటకు వచ్చే పొగడ్తలను రచయితలకు ఇవ్వండని ఆయన సూచించారు. 
 
తన దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం డీజే - దువ్వాడ జగన్నాథం. ఈ చిత్రం ఆడియో ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ చిత్రం ఆడియో లాంచ్ తర్వాత ఆయన మాట్లాడుతూ.. డీజే సినిమాలో బ్రాహ్మణ యువకుడి పాత్ర కోసం అల్లు అర్జున్ చాలా కష్టపడ్డాడని చెప్పాడు. బ్రాహ్మణ యాస కోసం మాంసాహారాన్ని మానేశాడని చెప్పాడు. ఈ సినిమాలో బ్రాహ్మణులు గర్వపడేలా చేసే సన్నివేశాలు, సర్ ప్రైజులు ఉన్నాయని హరీష్ శంకర్ తెలిపాడు. దిల్ రాజు లాంటి నిర్మాత దొరకడం సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాక్షస ప్రవర్తనకు కారణం ఏమిటి?