Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గ్రీన్ ఇండియా ఛాలెంజ్: మొక్కలు నాటిన ప్రముఖ హాస్యనటుడు పద్మశ్రీ బ్రహ్మానందం

Advertiesment
గ్రీన్ ఇండియా ఛాలెంజ్: మొక్కలు నాటిన ప్రముఖ హాస్యనటుడు పద్మశ్రీ బ్రహ్మానందం
, శనివారం, 27 జూన్ 2020 (11:59 IST)
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా ప్రముఖ యాంకర్ ఉదయభాను ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి నేడు మణికొండ లోని తన నివాసంలో మొక్కలు నాటారు ప్రముఖ హాస్యనటుడు పద్మశ్రీ బ్రహ్మానందం.
 
ఈ సందర్భంగా బ్రహ్మానందం ఉదయభానుతో మాట్లాడిన విషయాలను ఉదయభాను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులకు వివరించడం జరిగింది. నేను ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటిన బ్రహ్మానందం గారికి ఉదయభాను కృతజ్ఞతలు తెలిపారు. సృష్టిని కాపాడేందుకు ఒంటి కాలిపై తపస్సు చేస్తుంది ఒక్క చెట్టు మాత్రమే అని. ఇది అక్షర సత్యం.
webdunia
ప్రకృతి పట్ల తనకు ఉన్న బాధ్యతను నాతో పంచుకున్నారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చాలా మంచి కార్యక్రమాన్ని చేపట్టారు అని అందుకు సంతోష్ గారికి అభినందనలు తెలియజేశారు. ఆ ఫోటోలను చూస్తుంటే నేలతల్లిపై కూర్చొని తన తల్లికి సేవ చేస్తున్నట్లు కనిపిస్తుంది. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా చాలామంది మొక్కలు నాటాలని ఆశిస్తున్నానని ఉదయభాను, బ్రహ్మానందంతో చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫ్యూచర్ సీఎం పవన్ కళ్యాణ్.. ఓన్లీ వన్ పీస్.. రామ్ గోపాల్ వర్మ