అల్లు అర్జున్ నటుడిగా భిన్నమైన శైలి. తను ఎన్నుకుంటున్న కథలు చూస్తేనే అర్థమవుతుంది. ఒక పక్క స్టయిలిస్ పాత్రలు వేస్తూనే మరోవైపు యాక్షన్ పాత్రలు చేస్తుంటాడు. కెరీర్ ఆరంభంలోనే ఆర్య సినిమాలో విభిన్నమైన కేరెక్టర్ ప్లేచేశాడు. ఆ సినిమాతో దర్శకుడు సుకుమార్ స్టయిలిష్ స్టార్‌గా బిరుదు ఇచ్చేశాడు. ఇప్పుడు ఆయన దర్శకత్వంలోనే `పుష్ప` చేస్తున్నాడు. అది దాదాపు ముగింపు దశకు వచ్చింది. కొంచెం వర్క్ వుంది. కాగా, కరోనా సెకండ్ వేవ్ వల్ల షూటింగ్ ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకు కారణం అక్కడ టెక్నీషియన్స్‌లో నలుగురికి కరోనా సోకడమే. దానికితోడు అల్లు అర్జున్‌కూడా పాజిటివ్ వచ్చిందని ఆయనే స్వయంగా తెలియజేశాడు.
ఇక తాజాగా అల్లు అర్జున్ ఓ సినిమా చేయబోతున్నాడని అతని సన్నిహితులు చెబుతున్నారు. పుష్ప తర్వాత ఆయన దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో చేయాల్సి వుంది. అయితే ఎన్.టి.ఆర్.తో కొరటాల శివ సినిమా సెట్‌పైకి వెళ్ళనుంది. ఆ సినిమా తర్వాత వుంటుందని సమాచారం.
ఇక బన్నీ కూడా ఓ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. అందుకు మురుగదాస్ దర్శకుడుగా ఎంచుకున్నారు. వీరిద్దరి చర్చల్లో గజనీ సినిమా గురించి ప్రస్తావన వచ్చింది. ఎప్పటినుంచో మురుగదాస్ గజనీ సీక్వెల్ చేయాలని వుందని చెబుతుండేవారు. ఇప్పడు అల్లు అర్జున్‌తో గజనీ2 చేస్తే బాగుంటుందని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. బన్నీకూడా పచ్చజెండా ఊపాడని టాక్. గజనీ సినిమా మురుగదాస్ 2005లో సూర్యతో చేశాడు.