Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజు యాదవ్‌ నుంచి గెటప్‌ శ్రీను సాంగ్ విడుదల

Advertiesment
Raju Yadav song
, గురువారం, 16 నవంబరు 2023 (15:10 IST)
Raju Yadav song
బుల్లి తెర కమల్ హాసన్‌గా పాపులరైన జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను హోల్సమ్ ఎంటర్ టైనర్ 'రాజు యాదవ్' తో హీరోగా ఆరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కృష్ణమాచారి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై కె. ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు.
 
ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. చిత్ర యూనిట్ ఫస్ట్ సింగిల్-రాజు యాదవ్ చూడు ని విడుదల ద్వారా మ్యూజికల్ జర్నీ ప్రారంభించింది. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ ఈ పాట‌ని లాంచ్ చేశారు.
 
హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యాజికల్ మెలోడీని అందించగా, రామ్ మిరియాల తన అద్భుతమైన వాయిస్ తో మరింత అందంగా ఆలపిచారు. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ లిరిసిస్ట్ చంద్రబోస్ లిరిక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
 
ఈ అద్భుతమైన మెలోడీ, హీరో తన ప్రేయసి పాత్ర పోషిస్తున్న అంకిత ఖరత్ పై తన ప్రేమను వ్యక్తపరుస్తున్నట్లు చాలా అందంగా ప్రెజంట్ చేస్తోంది. ఈ పాటలో విజువల్స్ చాలా ప్లజెంట్ గా వున్నాయి. పాటకు ఇన్స్టంట్ గా సూపర్ రెస్పాన్స్ వస్తోంది.
 
లవ్, కామెడీతో పాటు సినిమాలో హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలు కూడా వున్నాయి.  రాజు యాదవ్ పోస్ట్ ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ పూర్తి అయ్యాయి. మేకర్స్ త్వరలో విడుదల తేదీని అనౌన్స్ చేస్తారు.
 
నటీనటులు: గెటప్ శ్రీను, అంకిత ఖరత్, ఆనంద చక్రపాణి, రాకెట్ రాఘవ, మిర్చి హేమంత్, జబర్దస్త్ సన్నీ, సంతోష్ కల్వచెర్ల, శ్రీరామ్, కళ్యాణ్ భూషణ్, శ్రీమణి, పవన్ రమేష్, ఉత్తర ప్రశాంత్, తదితరులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అభిమానులకు లోకేష్ షాక్.. ఇకపై మూవీస్ చేయడట!