Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేనేం అందగత్తెను కాను అంటున్న 'గీత గోవిందం' హీరోయిన్

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇటీవలి కాలంలో ఒక్కసారిగా మంచి గుర్తింపు పొందిన హీరోయిన్ రష్మిక మందన్న. విజయ్ దేవరకొండ హీరోగా పరుశురాం దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ 2 నిర్మాణ సంస్థలో వచ్చిన చిత్రం 'గీత గోవిందం'.

Advertiesment
Geetha Govindam
, మంగళవారం, 28 ఆగస్టు 2018 (15:34 IST)
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇటీవలి కాలంలో ఒక్కసారిగా మంచి గుర్తింపు పొందిన హీరోయిన్ రష్మిక మందన్న. విజయ్ దేవరకొండ హీరోగా పరుశురాం దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ 2 నిర్మాణ సంస్థలో వచ్చిన చిత్రం 'గీత గోవిందం'. ఈ చిత్రంలో రష్మిక మందన్న.. మాటల కంటే హావభావాలతోనే ఇట్టే ఆకట్టుకుంది. దీంతో ఆమె నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. అదేసమయంలో ఈమెకు ఆఫర్లు కూడా కోకొల్లలుగా వస్తున్నాయి.
 
తన సక్సెస్‌తో పాటు గ్లామర్‌పై రష్మిక స్పందిస్తూ, నాయికలంటే అందంగా ఉండాలి. గ్లామర్‌గా కనిపించాలని ఏం లేదని చెబుతోంది. తన దృష్టిలో అందమంటే వ్యక్తిత్వమని కొత్త నిర్వచనం చెప్పింది. తాను మిస్‌ క్లీన్‌ అండ్‌ క్లియర్‌ బ్యూటీగా ఎంపికైంది కూడా తన ఆత్మవిశ్వాసంతోనే అని గుర్తు చేసింది. 
 
రశ్మిక అభిప్రాయంలో చెప్పాలంటే… నేనేం అందగత్తెను కాను. నాకు మేకప్‌ వేసుకోవడం, బాగా అలంకరించుకోవడం ఇష్టముండదు. నాలాంటి హీరోయిన్‌లను తెరపై ప్రేక్షకులు చూస్తారా అని తొలి చిత్రానికి భయపడ్డాను. నటించే పాత్ర బాగుంటే గ్లామర్‌గా ఉండాలనేది పట్టించుకోరని అర్థమైంది. నేనెలా ఉంటానో అలా సహజంగా కనిపించడమే నాకిష్టం. బయటకు వెళ్లినప్పుడు ఏమాత్రం మేకప్‌ లేకుండా వెళ్తాను. సినిమాలోనూ అలాగే ఉంటానని చెబుతాను కానీ సినిమా కోసం యూనిట్‌ చెప్పినట్లు నడుచుకోవాలి కాబట్టి తప్పడం లేదు. 
 
అవకాశాలు వస్తున్నాయి కదానీ అన్ని చిత్రాలు అంగీకరించను. అలా చేస్తే ఏ ఒక్క సినిమాకూ న్యాయం చేయలేను. నేను ఒప్పుకున్న చిత్రమేదైనా నా ప్రయత్నం వందశాతం ఉండేలా చూసుకుంటాను. అని చెప్పింది. కాగా, ఈ భాగమ కన్నడంలో చేసిన మూడు, తెలుగులో నటించిన రెండు చిత్రాలు ఘన విజయాలు సాధించాయి. తాజా సినిమా 'గీత గోవిందం' అద్భుత విజయం దిశగా సాగుతోంది. అలాగే ప్రస్తుతం రష్మిక తెలుగులో 'దేవదాస్'‌, 'డియర్‌ కామ్రేడ్‌' చిత్రాల్లో నటిస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్యను వదిలేశాను.. ఆస్తి అమ్మేశాను.. నీవే సర్వస్వం అనుకుంటే.. మొగుడు గుర్తుకొస్తున్నాడా?