Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

''గాయత్రి'' టీజర్: అర్థం చేసుకుంటారో అపార్థం చేసుకుంటారో ఛాయ్స్ ఈజ్ యువర్స్

''పెళ్లైన కొత్తలో" ఫేమ్ మదన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ''గాయత్రి'' చిత్రంలో మోహ‌న్ బాబు కూతురిగా నిఖిల విమల్ నటిస్తోంది. ఈమె అల్ల‌రి న‌రేష్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన టాలీవుడ్ చిత్రం మేడ మీద అబ్బాయ

Advertiesment
Gayatri Official Teaser
, శనివారం, 13 జనవరి 2018 (15:36 IST)
''పెళ్లైన కొత్తలో" ఫేమ్ మదన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ''గాయత్రి'' చిత్రంలో మోహ‌న్ బాబు కూతురిగా నిఖిల విమల్ నటిస్తోంది. ఈమె అల్ల‌రి న‌రేష్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన టాలీవుడ్ చిత్రం మేడ మీద అబ్బాయి మూవీతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. నిఖిల విమల ఫస్ట్ లుక్ విడుదల తాజాగా విడుదలైంది. ఈ పోస్టర్‌పై నేను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నానంటే కారణం మా నాన్న అని రాసి వుంది. 
 
ఇక నిఖిల పోస్ట‌ర్‌ని ట్విట్ట‌ర్‌లో షేర్ చేసిన మోహ‌న్ బాబు ''ఆడపిల్ల పుట్టిందంటే... మన అమ్మే మళ్ళీ పుట్టినట్టు" అనే కామెంట్ పెట్టాడు .గాయ‌త్రి చిత్రంలో మోహన్ బాబు డబుల్ రోల్ చేయనున్నాడు. అందులో ఒకటి హీరో పాత్ర అయితే.. ఇంకోటి విలన్ క్యారెక్టర్ అని తెలిసింది. ఈ చిత్రాన్ని లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బేనర్ మీద మంచు ఫ్యామిలీనే నిర్మిస్తోంది.
 
అలాగే మంచు విష్ణు కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో విష్ణు సరసన శ్రియ నటిస్తోంది. యాంకర్ అనసూయ కూడా ఇందులో కీలక రోల్ పోషిస్తోంది. ఫిబ్రవరి 9న ఈ సినిమా రిలీజవుతుంది. ఈ నేపథ్యంలో 'గాయత్రి ' సినిమా టీజర్ విడుదలైంది. 
 
"రామాయణంలో రామునికి, రావణాసురునికి గొడవ, మహాభారతంలో పాండవులకి, కౌరవులకి మాత్రమే గొడవ.. వాళ్లు వాళ్లు కొట్టుకుని ఎవరో ఒకరు చనిపోయుంటే బాగుండేది.. కానీ వాళ్ల మూలంగా జరిగిన యుద్ధంలో అటు, ఇటు కొన్ని లక్షల మంది సైనికులు చనిపోయారు. పురాణాల్లో వాళ్లు చేసింది తప్పయితే, ఇక్కడ నేను చేసింది కూడా తప్పే"... అంటూ మోహన్ బాబు చెప్పే పవర్ ఫుల్ డైలాగులు అదుర్స్ అనిపించాయి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

''సాహో'' టీమ్‌తో స్వీటీ