Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గౌతమీపుత్ర శాతకర్ణి యుద్ధ సన్నివేశాలు.. ఆయుధాల తయారీ కోసం ఫ్యాక్టరీ!

Advertiesment
Gautamiputra Satakarni unit leaving to Morocco in early May
, బుధవారం, 27 ఏప్రియల్ 2016 (09:11 IST)
క్రిష్, బాలకృష్ణ కాంబినేషన్‌లో రూపొందుతున్న హిస్టారికల్ చిత్రం ''గౌతమీపుత్ర శాతకర్ణి''. బాలయ్య 100 వ చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని అమరావతి రాజు ''గౌతమీపుత్ర శాతకర్ణి'' కథ ఆధారంగా రూపొందిస్తున్నారు. యాక్షన్ పరమైన చిత్రాలకంటే, చారిత్రక సినిమాలను తెరకెక్కించడానికి చాలా కష్టపడవలసి వుంటుంది. అలనాటి సామాజిక పరిస్థితులను చూపించడానికి ఎంతో శ్రమపడవలసి వుంటుంది. 
 
వస్త్రధారణ.. ఆభరణాలు.. వస్తువులు వంటి వాటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. చారిత్రక చిత్రాల్లో యుద్ధాలు తప్పనిసరిగా వుంటాయి కనుక, ఆయుధాల తయారీకే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కథాపరంగా ఈ చిత్రంలో చాలా యుద్ధ సన్నివేశాలను దర్శకుడు చిత్రీకరించబోతున్నారు. ఈ యుద్ధంపు సన్నివేశాల కోసం చాలా రకాల కాస్ట్యూమ్స్, ఆయుధాలు అవసరం కావడంతో క్రిష్ ఈ పనుల కోసం ఆయుధాల ఫ్యాక్టరీ‌ని నెలకొల్పాడు. 
 
'గౌతమీపుత్ర శాతకర్ణి' కాలం నాటి ఖడ్గాలు .. డాళ్లు .. బరిసెలు .. కవచాలు .. కిరీటాలు .. రథాలకి అవసరమైన పరికరాలు మొదలైనవి ఈ వర్క్ షాప్‌లో తయారు చేయించనున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు మొరాకోలో చిత్రీకరించాలని సన్నాహాలు చేస్తున్నాడట. మూడు వారాల పాటు అక్కడ షూటింగ్ జరుగనుందని యూనిట్ సభ్యులు అంటున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ని మే నెలలో మొదలుపెట్టాలని దర్శకనిర్మాతలు నిర్ణయించుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీవీ యాంకర్‌తో వివాహేతర సంబంధం.. టీవీ దర్శకుడిపై భార్య ఫిర్యాదు!