శకుంతలా దేవీ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ చిత్రంలో శకుంతలా దేవి పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తుంది. తాజాగా విడుదలైన పోస్టర్‌లో విద్యాబాలన్ నెం.1 పొజిషన్‌లో ఉండగా, కంప్యూటర్, క్యాలికులేటర్ రెండు మూడు స్థానాల్లో ఉన్నట్లుగా డిజైన్ చేశారు. ఈ సినిమాకు అను మీనన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్ కానుంది.
కంప్యూటర్ కంటే వేగంగా గణితంలో రాణించడం.. మానవ మేధస్సుకు సాధ్యపడనిది లేదని నిరూపించిన శకుంతలా దేవి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. హ్యూమన్ కంప్యూటర్‌గా పేర్గాంచిన శకుంతలా దేవీ పాత్రలో విద్యాబాలన్ కనిపించనుంది.